Breaking News

మేడిగడ్డపై తుది నివేదిక కోసం విజిలెన్స్‌ కసరత్తు

Published on Sun, 10/06/2024 - 04:51

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌ వైఫల్యానికి గల కారణాలపై తుది నివేదిక అందించడానికి వీలుగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కసరత్తును ముమ్మరం చేసింది. మేడిగడ్డ బరాజ్‌కి సంబంధించిన అంశాలపై లోతైన విచారణలో భాగంగా కీలక అధికారులను విచారించింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు శనివారం నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్‌సీ (జనరల్‌) సి.మురళీధర్, డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ అజ్మల్‌ ఖాన్‌ హాజరయ్యారు. మేడిగడ్డ బరాజ్‌ నిర్మాణంలో మార్పులు, చేర్పులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు..? సవరణ అంచనాలకు ఆమోదం తెలిపిందెవరు..? 

మేడిగడ్డ నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారంటీలు విడుదల చేయాలని ఆదేశించింది ఎవరు..? వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 7న ఈఎన్‌సీ (ఓ అండ్‌ ఎం), స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు బి.నాగేంద్రరావును, 8న సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ టి.శ్రీనివాస్, డైరెక్టర్‌ వర్క్‌ అకౌంట్స్‌ డైరెక్టర్‌ వి.ఫణిభూషణ్‌శర్మను విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. 

ఇప్పటికే ఈ సంస్థ ప్రాథమిక, మధ్యంతర నివేదికలు అందించగా...తుది నివేదికను సత్వరం అందించాలని కాళేశ్వరం విచారణ కమిషన్‌ విజిలెన్స్‌ను ఆదేశించింది. సెప్టెంబర్‌ నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించగా..ఆ సంస్థ మరింత గడువును కోరినట్లు తెలిసింది. దాంతో ఈ నెలాఖరుకల్లా తుది నివేదికను సమర్పించడానికి అవసరమైన వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకోవడానికి వీలుగా కసరత్తును చేపట్టింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)