Breaking News

ధాన్యం రవాణాకు వాహనాలు అందుబాటులో ఉంచాలి

Published on Wed, 05/28/2025 - 05:38

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం రవాణా కోసం సమస్యలు తలెత్తకుండా రవాణా, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి అవసరమైన వాహనాలు అందుబాటులో ఉంచాలని పౌరసరఫరాల శాఖమంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆదేశించారు. రైస్‌ మిల్లర్లు సహకరించని పక్షంలో ఇంటర్మీడియట్‌ గోదాములకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉత్తమ్‌ మాట్లాడారు. రైతులకు ధాన్యం చెల్లింపులు ట్యాబ్‌ ఎంట్రీ పూర్తి చేసిన 48 గంటల్లోగా పూర్తి చేస్తున్నామన్నారు.

ధాన్యం కొనుగోలు అంశంపై ఎలాంటి వ్యతిరేక వార్తలొచ్చాయి విచారించి చర్యలు తీసుకోవాలని, తప్పుడు వార్తలొస్తే వెంటనే ఖండించాలని మంత్రి ఆదేశించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పైలట్‌ ప్రాజెక్టు కింద మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లలో 15 శాతం మాత్రమే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, మిగిలిన వాటిని వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

భూ భారతి చట్టం కింద పైలట్‌ మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను పరిష్కరించి జూన్‌ 2న పట్టాలు పంపిణీ చేయాలన్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వానాకాలం పంట సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధం కావాలని, విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా కలెక్టర్‌లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రుతుపవనాలు వస్తున్న నేపథ్యంలో పెండింగ్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్లకు సీఎస్‌ కె.రామకృష్ణారావు సూచించారు.

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు