Breaking News

15 ఏళ్లు దాటిన వాహనాల్లో బైక్‌లదే అగ్రస్థానం.. హైదరాబాద్ జిల్లాలోనే అధికం

Published on Thu, 10/10/2024 - 17:25

vehicle scrapping policy 2024: పదిహేను ఏళ్లు దాటిన వాహనాల విషయంలో ప్రభుత్వం కొత్తగా తెచ్చిన‌ ‘వాలంటరీ వెహికల్‌ స్క్రాపింగ్‌ పాలసీ’ ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణ‌ రవాణాశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 15 ఏళ్లు గడువు తీరిన వాహనాలు దాదాపు 21 లక్షలకుపైగా ఉన్నాయి. వీటిలో సింహభాగం గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. స్క్రాపింగ్‌ తప్పనిసరి కాదనడంతో కొందరు వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. రిజిస్టర్డ్‌ వెహికల్‌ స్క్రాపింగ్‌ ఫెసిలిటీ (ఆరీ్వఎస్‌ఎఫ్‌) పేరిట స్క్రాపింగ్‌కు రాష్ట్రవ్యాప్తంగా సదుపాయాలు కల్పించనున్నారు.  

ద్విచక్రవాహనాలే అధికం  
మొత్తంగా 21.27 లక్షల వాహనాల కాలం తీరిపోయింది. అయితే వీటిని ఇప్పటికిప్పుడు స్క్రాప్‌నకు పంపాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. వీటిలో ఫిట్‌నెస్‌ బాగుంటే మునుపటిలా నడుపుకోవచ్చు రూ.5 వేలు చెల్లించి ఐదేళ్లు, ఆ తర్వాత కూడా ఫిట్‌గా ఉంటే.. రూ.10 వేలు చెల్లించి మరో ఐదేళ్లు నడుపుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 21,27,912 వాహనాలు 15 ఏళ్లు వయసు పైబడ్డాయి. ఇందులో 9 లక్షల వాహనాలు హైదరాబాద్‌లో ఉండగా.. రంగారెడ్డిలో 2.3 లక్షల వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల్లో అధికశాతం ద్విచక్ర వాహనాలే కావడం గమనార్హం.

మళ్లీ అందులోనూ 1.3 లక్షల బైకులు హైదరాబాద్‌కు చెందినవి కాగా, 1.8 లక్షల ద్విచక్రవాహనాలు రంగారెడ్డిలో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల తర్వాత 15 ఏళ్లు పైబడిన వాహనాలు వరుసగా మేడ్చల్‌ (1.5 లక్షలు), కరీంనగర్‌ (1.5 లక్షలు) నిజామాబాద్‌ (1.2 లక్షలు) జిల్లాల్లో ఉన్నాయి. ఈ లెక్కన గ్రీన్‌ ట్యాక్స్‌ అత్యధికంగా గ్రేటర్‌ పరిధిలోనే వసూలు కానుందని రవాణాశాఖ అధికారులు తెలిపారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)