Breaking News

Hyderabad: మద్యం బాటిళ్ల లారీ బోల్తా.. ఎగబడ్డ జనం

Published on Thu, 05/23/2024 - 08:06

రసూల్‌పురా: మద్యం సీసాల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వాహనం టైరు పేలి బోల్తా పడిన ఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొంపల్లి ఐఎంఎఫ్‌ఎల్‌ డిపో నుంచి రూ.32 లక్షల విలువైన మద్యం కాటన్‌ బాక్సులతో  డీసీఎం కంటైయినర్‌ బంజారాహిల్స్‌ వైపు వెళ్తోంది. 

బోయిన్‌పల్లి ఎంఎంఆర్‌ గార్డెన్‌ వద్దకు చేరుకోగానే వెనక టైరు పేలి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి  బోల్తాపడింది. ఈ ఘటనలో కంటెయినర్‌లో నుంచి  మద్యం సీసాల కాటన్‌ బాక్స్‌లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 

సమీపంలో ఉన్న బస్తీవాసులు, రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు మద్యం సీసాలను తీసుకుని ఉడాయించారు. మద్యం సీసాలను తీసుకుని వెళ్తున్న కొందరిని డీసీఎం డ్రైవర్‌ బసవలింగప్ప, ఇద్దరు హెల్పర్లు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న లా అండ్‌ ఆర్డర్, ట్రాఫిక్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రించారు. డీసీఎం బోల్తా పడిన ఘటనతో జాతీయ రహదారిపై మూడు గంటల పాటు ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది.  

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు