Breaking News

వనపర్తిలో వీరగల్లు స్మారక శిలలు

Published on Mon, 06/09/2025 - 01:13

వనపర్తి టౌన్‌: చైతన్య, వివేకాపర్తిగా పేరున్న వనపర్తిలో క్రీస్తు పూర్వం నాటి వీరగల్లు యుద్ధ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధంలో వీరుల మరణాలను స్మరించుకునే వీరగల్లు శిలలు వనపర్తి జిల్లా కేంద్రంలో వెలుగుచూశాయి. పట్టణంలోని పోచమ్మగుడి వద్ద శతాబ్దాల నాటి వీరగల్లు స్మారక శిలలను చరిత్ర పరిశోధకులు, చరిత్రకారులు బైరోజు చంద్రశేఖర్, డాక్టర్‌ శ్యాంసుందర్‌ గుర్తించారు. ఈ వీర శిలలలో తొమ్మిది మంది వీరుల్లో ఒక అశ్వారూఢుడైన వీరుడు బల్లెంతో, మరొక వీరుడు బల్లెం, డాలుతో కనిపిస్తున్నాయి. 

కొన్ని దశాబ్దాల కిందట కర్ణాటక, తెలంగాణలోని సిద్దిపేట, వనపర్తి, వికారాబాద్‌లో వీరగల్లుల ఆనవాళ్లు ఉన్నట్లు ప్రముఖ ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. వీరగల్లు శిలలు కొన్నేళ్ల తరబడి వనపర్తిలోని పోచమ్మ ఆలయంలో ఉన్నప్పటికీ వాటిని ఎవరూ గుర్తించలేపోయారు. ఈ క్రమంలోనే వనపర్తిలోని చిట్యాల రోడ్డులో వీరులగడ్డ అనే పేరుతో ఒక ప్రాంతం ఉండటంతో ఆ పేరు ఎలా వచ్చిందని పరిశోధకులు పరిశీలిస్తుండగా, వనపర్తి పోచమ్మ ఆలయంలో ఉన్న శిలలు వీరగల్లు విగ్రహాలని తేలింది. 

150– 300 ఏళ్ల కిందట వీరుల స్మారక శిలలను వనపర్తిలోని పోచమ్మ ఆలయంలో భద్రపరిచినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు ఈ వీరగల్లు శిలలను స్థానిక ప్రజలు దేవతామూర్తులుగా భావించారు. ఈ వీరశిలలలో సతి శిలలు నాలుగు, కత్తి ఆయుధంగా ధరించిన ఎక్కటీలు ఇద్దరు ఉన్నారు. 

వనపర్తి చరిత్ర శతాబ్దాల కిందటిదే.. 
వీరుల స్మారక శిలలు ఒకేచోట లభించడంతో వందలు, వేల సంవత్సరాల కిందటే వనపర్తి ఒకనాటి యుద్ధరంగమై ఉంటుందని చరిత్రకారులు, పరిశోధకులు భావిస్తున్నారు. వీరగల్లు శిలలు క్రీస్తు పూర్వం నుంచి ఉన్నాయని, వీరగల్లులలో దాదాపు 40 రకాలున్నాయని, శాసనంతో కూడిన వీరగల్లులు వాటిలో ప్రత్యేకమని కొత్త తెలంగాణ చరిత్ర బృంద కన్వినర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ తెలిపారు. వనపర్తికి అతి సమీపంలో ఉండే నాచహళ్లి గ్రామంలో గోపాల్‌ వ్యవసాయ పొలంలో కూడా శాసనంతో కూడిన గుడిలాంటి ప్రాంతంలో ఒక సతి శిల, ఒక వీరశిల ఉన్నట్లు గుర్తించామన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)