Breaking News

మరో రెండు నెలలు నిరీక్షణే...!

Published on Sun, 10/22/2023 - 04:16

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ శాఖల్లో బిల్లుల క్లియరెన్స్‌కు నిరీక్షణ తప్పేలా లేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో నిధుల విడుదలకు కొంతకాలం బ్రేక్‌ పడనున్నట్లు అధికారవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వం నుంచి చెల్లింపులకు రెండు, మూడు త్రైమాసికాలు అత్యంత కీలకం. తొలి త్రైమాసికంగా బడ్జెట్‌ సర్దుబాట్లు, ఇతరాత్రా కారణాలతో చెల్లింపుల ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. ఆ తర్వాత నుంచి నిధుల లభ్యత, ప్రాధాన్యతలకు అనుగుణంగా చెల్లింపుల్లో వేగం పుంజుకుంటుంది.

కానీ ఈసారి సంక్షేమ శాఖలకు రెండో త్రైమాసికంలో నిధులు విడుదల కాలేదు. పలు రకాల చెల్లింపులు నిలిచిపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. ప్రధానంగా పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు భారీగా పేరుకుపోయాయి. సంక్షేమ శాఖలు ఆమోదించి ఖజానా విభాగానికి పంపించినప్పటికీ అక్కడ క్లియరెన్స్‌ రాని బిల్లులు దాదాపు రూ.1,175 కోట్లు ఉన్నాయి.

ఇవిగాకుండా సంక్షేమ వసతిగృహాలు, గురుకుల విద్యా సంస్థలకు సంబంధించిన డైట్‌ చార్జీలు మరో రూ.675 కోట్లు ఉన్నాయి. మొత్తంగా రూ.1,850 కోట్లు ఖజానా విభాగంలో పెండింగ్‌లో ఉండగా... ఇవి రెండో త్రైమాసికంలో వస్తాయని అధికారులు భావించారు. చివరి నిమిషం వరకు సంక్షేమాధికారులు వేచిచూసినప్పటికే నిరాశే మిగిలింది. ఈ క్రమంలో మూడో త్రైమాసికంలోనైనా ఈ నిధులకు మోక్షం కలుగుతుందని భావించినప్పటికీ ఎన్నికల నేపథ్యంలో వాటి విడుదలలో జాప్యం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

చివరి క్వార్టర్‌పైనే ఆశలు...
విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల కింద దాదాపు 12.65లక్షల మంది లబ్ధిదారులుంటారు. వీరితో పాటు మరో 10 లక్షల మంది గురుకుల విద్యా సంస్థలు, సంక్షేమ వసతిగృహాల్లో ఉంటున్నారు. ఈ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలు ఎంతో కీలకం. కోర్సును ముందుకు సాగించాలన్నా... వసతిగృహంలో ఉండాలన్నా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే దిక్కు.

కొంతకాలంగా ఈ రెండు పథకాలకు, డైట్‌ చార్జీల విడుదలలోనూ జాప్యం చేస్తూ వచ్చింది. క్షేత్రస్థాయి నుంచి గురుకులాలు, వసతిగృహాలు, సంక్షేమ అధికారుల ద్వారా ఆమోదం పొందిన బిల్లులన్నీ ఖజానా విభాగంలో నిలిచిపోయాయి. గతేడాది నవంబర్‌ నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉపకారవేతన నిధుల విడుదల నిలిచిపోయింది. ఇవన్నీ 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించినవే.

ఇవిగాకుండా 2022–23 విద్యా సంవత్సరం దరఖాస్తు పరిశీలన. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు బిల్లులు రూపొందించి ఆమోదించిన బిల్లులకు గత రెండు త్రైమాసికాల్లో రిక్తహస్తం చూపిస ప్రభుత్వం మూడో త్రైమాసికంలోనైనా నిధులు విడుదల చేస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత... చివరి త్రైమాసికంలోనే నిధులు విడుదలయ్యే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)