Breaking News

గిరులు.. సంప్రదాయాల సిరులు

Published on Sun, 06/22/2025 - 11:28

భద్రాద్రి కొత్తగూడెం: గిరిజన గ్రామాల ప్రజల జీవితం ప్రకృతి, సంప్రదాయాలు, ఆచారాలతో ముడిపడి ఉంటోంది. ఏటా వానాకాలం ఆరంభానికి ముందు నిర్వహించే వన భోజనాలు గిరిజనుల నమ్మకాలు, ఆశలు, ప్రకృతిపై భక్తిని చాటిచెబుతాయి. వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు.. గిరిజన గ్రామాల్లో బోనాల పండుగ నిర్వహించి గ్రామ దేవతలను పూజిస్తారు. ఆపై బోనాల సందడి మొదలవుతుంది. 

భోజనాలు.. ఆటపాటల సందడి 
వన భోజనాలకు వెళ్లినప్పుడు, ప్రతీ కుటుంబం తమ వంతు ఆహార పదార్థాలు తీసుకెళ్తారు. కొందరు అక్కడే వంటలు చేసుకుంటారు. ఆతర్వాత ఒకేచోట కూర్చుని సహపంక్తి భోజనం చేస్తారు. ఆపై పెద్దలు కబుర్లు చెప్పుకుంటూ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు. ఇక పిల్లాపాపలు ఆటపాటలతో సందడి చేస్తారు.  

వనంలోకి వెళ్లి పూజలు..  
బోనాల పండుగ ముగిశాక గిరిజనులు వన భోజనాలకు బయలుదేరుతారు. నిర్ణీత రోజు.. ఊరంతా కలిసి సామూహికంగా సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్తారు. వన భోజనాలు అంటే కేవలం భోజనం చేయడమే కాక.. ప్రత్యేకించి వృక్షాలు, ప్రకృతికి పూజలు నిర్వహిస్తారు. అక్కడి వేపచెట్టు, రావిచెట్ల మొదట్లో అటవీ దేవతలను ప్రతిష్టిస్తారు. వాటికి పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమరి్పస్తారు. ఈ క్రతువు ద్వారా వారు భూమి, వర్షం, అటవీ సంపదకు కృతజ్ఞతలు చెబుతారు.

పాడిపంటల కోసం ప్రార్థన 
బోనాలు, వన భోజనాల వెనుక ప్రధాన ఉద్దేశం పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రకృతి, దైవాలను వేడుకోవడమే. గిరిజనుల జీవనం పూర్తిగా వ్యవసాయం, అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి ఉంటుంది. వర్షాలు సరిగ్గా కురవకపోతే వారికి ఇక్కట్లు ఎదురవుతాయి. అందుకే ఏటా వానాకాలం ప్రారంభానికి ముందు పంటలు సమృద్ధిగా పండాలని, పాడి పెరగాలని ప్రకృతి దేవతలను ప్రసన్నం చేసుకునేలా పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

మా కాలంలో వేరు.. 
మా కాలంలో టీవీలు, ఫోన్లు లేవు. వనభోజనాలంటే సరదాగా ఉండేది. వానలు బాగా పడి పంటలు పండాలని గ్రామ దేవతలకు బోనాలు సమరి్పంచి ఆ తర్వాత అడవికి వెళ్తాం. తొలుత ఉమ్మడిగా కలిసి కుండల్లో వంటకాలు సిద్ధం చేసుకునేవాళ్లం. 
– పోలెబోయిన రామచంద్రయ్య, వెంకటాపురం

బంధాలను కలిపే పండుగ.. 
వన భోజనాలు అనగానే.. ఉదయమే సామగ్రి సర్దుకుని వెళ్తాం. పచ్చని చెట్ల కింద రోజంతా బంధువులతో గడపడం ఆనందంగా ఉంటుంది. అమ్మాయిలం కోలాటం ఆడుతూ పాడతాం. ఇది మా మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది.    
 – ఈసం అమృత, పద్మాపురం

ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పడానికి..  
వన భోజనాలంటే మాకు ఊరు పండుగ. వానలు పడాలి, పంటలు బాగా పండాలని దేవుడిని మొక్కుకుని ప్రకృతికి కృతజ్ఞతలు చెబుతాం. ఇదంతా వేడుక మాదిరి సాగుతుంది. మా తాత, తండ్రి తర్వాత వారసత్వంగా ఏటా కొనసాగిస్తున్నాం. 
– చందా రామకృష్ణ, చిరుమళ్ల  

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)