Breaking News

కనుల పండువగా ఉత్తర ద్వార దర్శనాలు

Published on Tue, 01/03/2023 - 01:18

భద్రాచలం/యాదగిరిగుట్ట/ధర్మపురి: రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ప్రధానాల యాల్లో ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులు పోటెత్తారు. దక్షిణ అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంతోపాటు యాదాద్రి, ధర్మపురి ల్లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు వేకువ జామునే భక్తులు చేరుకున్నారు.

భద్రాచలంలో జగదభి రాముడు గరుడవాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్‌ వాహనంపై ఆసీనులై ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వగా యాదాద్రిలో లక్ష్మీనృసింహస్వామి గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకారంలో వేంచేసి ఆలయ ఉత్తర ద్వారం గుండా వైకుంఠనాథుడిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అలాగే జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయంలోనూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులను అనుగ్రహించారు.

భద్రాద్రిలో...: భద్రాచలంలో సోమ వారం తెల్లవారుజామున వైకుంఠ ద్వా ర దర్శనానికి ముందు రుగ్వేద, యజు ర్వేద, సామవేద, అదర్వణ వేదాలను పఠించిన అనంతరం ద్వారదర్శన ప్రాశస్త్యాన్ని వేదపండితులు భక్తులకు వివరించారు. సరిగ్గా 5 గంటలకు ఉత్తర ద్వారాలు తెరుచుకోగా గరుడవాహన రూరుడై విచ్చేసిన శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ని భక్తులు కన్నులారా వీక్షించి తరించారు. ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడి లోని మూలవరులను దర్శించుకున్నారు. 

యాదాద్రిలో...
యాదాద్రిలో వేకువజామునే ప్రధానాలయంలో స్వామి అమ్మవార్లకు అర్చ కులు సుప్రభాతం, ఆరాధన, బాలభోగం, తిరుప్పావై చేపట్టి అలంకార సేవలు చేశారు. సరిగ్గా ఉదయం 6:48 గంటలకు స్వామి వారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారం నుంచి భక్తు లను అనుగ్రహించారు. ఉదయం 6:48 గంట ల నుంచి 7:30 గంటల వరకు స్వామిని దర్శించుకొనేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. అనంతరం ఆలయ తిరువీధుల్లో స్వామిని ఊరేగించారు.

ఆ తర్వాత ఆలయంలో అధ్య యనోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం స్వామిని విష్ణుమూర్తిగా అలంకరించి మత్స్య అవతారంలో ఊరేగించారు. యాదాద్రి ప్రధానా లయ ఉద్ఘాటన తర్వాత తొలిసారి జరిగిన ఉత్తర ద్వార దర్శనానికి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి,  గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పలువులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారు లు పెద్ద ఎత్తున  తరలివచ్చారు.

కాగా, యాదా ద్రి కొండకు దిగువనున్న తులసీ కాటేజీలో దాతల సహకారంతో రూ. 21 కోట్ల వ్యయంతో నిర్మించిన 240 గదుల సముదాయాన్ని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. ఇక పాతగుట్ట (çపూర్వగిరి) ఆలయంలో సైతం ఉదయం 6:48 గంటలకు నృసింహుని వైకుంఠద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు. మరోవైపు ధర్మపురిలో ఉదయం 5:55 గంటలకు ఉత్తర ద్వార దర్శనాలను ఆలయ అధికారులు అనుమతించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సహా పలువురు ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు.

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)