Breaking News

డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌గా వైద్య విధాన పరిషత్‌

Published on Thu, 12/05/2024 - 03:51

సాక్షి, హైదరాబాద్‌: డాక్టర్లు, నర్సులు, ఇతర మెడి కల్‌ స్టాఫ్‌ ప్రభుత్వం ద్వారా నియమించబడి.. ప్రభుత్వ ఆసుపత్రు ల్లోనే పనిచేస్తారు. వారికి జీత భత్యాల కోసం ప్రభుత్వమే నిధులిస్తుంది. పదవీ విరమణ తరువాత పెన్షన్‌ కూడా ప్రభుత్వమే ఇస్తుంది. కానీ, వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. 

ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించే ‘గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌’ ద్వారా జతభత్యాలు పొందుతూ.. ప్రభుత్వం తర ఫున పనిచేసే తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (వీవీపీ) ఉద్యోగులు వీరు. తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్నో ఏళ్లుగా వీరు ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటూనే ఉన్నారు. 

ఇప్పుడు వారి కోరిక నెరవేర బోతున్నది. సుమారు 40 ఏళ్లుగా ప్రభుత్వంలో ప్రత్యేక కేటగిరీగా కొనసాగుతన్న వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వ శాఖగా గుర్తించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోకి వీవీపీని తీసుకొని డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌గా మార్చాలని సంకల్పించింది. ఈ మేరకు త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

సీహెచ్‌సీ నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వీవీపీ పరిధిలోనే..
రాష్ట్రంలో వీవీపీ పరిధిలో కింగ్‌కోఠి, కరీంనగర్, ఖమ్మం, సంగారెడ్డి, నల్లగొండ జిల్లా ఆసుపత్రులతో పాటు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, మెటర్నల్‌ చైల్డ్‌ హెల్త్‌ సెంటర్లు సహా175 వరకు ఉన్నా యి. 

ఈ ఆసు పత్రుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర స్టాఫ్‌కు సాంకేతికంగా ప్రభుత్వం నుంచి నేరుగా జీతభత్యాలు అందవు. వీవీపీ కింద సుమారు 11 వేల మందికిపైగా ఉద్యో గులు పనిచేస్తు ండగా, వీరికి చెల్లించే జీతాలకు పే స్కేల్‌ కనిపించదు. 

ప్రభుత్వం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద ఏటా కేటాయించే మొత్తాన్ని నెలనెలా వేతనాల కోసం సర్దు బాటు చేస్తారు. తమను ప్రభుత్వ ఉద్యోగు లుగా గుర్తించాలని కొంతకాలంగా కోరుతున్నారు. కొద్దిరోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహను కలిసి ఈ మేరకు విన్నవించడంతో ఫైలు కదిలింది. 

త్వరలో ఉత్తర్వులు..  
వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌గా వైద్యారోగ్య శాఖలోకి తీసుకోవాలనే ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం.. ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అడ్మిని్రస్టేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా (ఆస్కి)ని కోరారు. ఆస్కి ఇటీవలే ప్రభు త్వానికి నివేదిక సమర్పించింది. మంత్రి రాజనర్సింహ ఉన్నతాధికారులతో సమావేశమై ఈ నివేదికపై ఇటీవల చర్చించారు. 

ఆ తర్వాత వీవీపీని వైద్యారోగ్య శాఖలో సెకండరీ హెల్త్‌ డైరెక్టరేట్‌ పరిధిలోకి తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రోగుల నుంచి వసూలు చేసే యూజర్‌ చార్జీల నుంచి జీతాలు చెల్లించే విధానాన్ని రద్దుచేసి వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి హయాంలో వీవీపీ ఉద్యోగులకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా జీతభత్యాలు చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఏపీలో ఇప్పటికే వీవీపీని ప్రభుత్వంలో విలీనం చేశారు.  

మా పోరాటం ఫలించింది
వీవీపీని వైద్యారోగ్య శాఖ పరిధిలోకి తీసుకొని సాంకేతికంగా మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గత కొంతకాలంగా పోరాడుతున్నాం. రెండున్నరేళ్ల నుంచి అన్ని ఉద్యోగ సంఘాలతో జేఏసీగా ఏర్పడి పోరాటాన్ని తీవ్రతరం చేశాం.

రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కలిసి 12 వేలకు పైగా ఉన్నాం. ప్రభు త్వం వైద్యారోగ్య శాఖలోకి విధాన పరిషత్‌ను తీసుకోవాలని భావిస్తుండడం శుభ పరిణామం. మా పోరాటానికి ఫలితం దక్కింది.     – డాక్టర్‌ వినయ్‌ కుమార్, జేఏసీ చైర్మన్‌ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)