Breaking News

ఎస్‌ఎల్‌బీసీ కాంట్రాక్టర్‌కు ఉత్తమ్‌ వార్నింగ్‌

Published on Fri, 12/19/2025 - 03:35

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు ప్రతిష్టాత్మకమైనది కాబట్టే ఇంత కాలం ఓపిక పట్టామని, సొరంగం తవ్వకాలను తక్షణమే పునః ప్రారంభించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్‌ను నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. గురు వారం సచివాలయంలో ప్రాజెక్టుపై సమీక్షించారు. ఒప్పందం ప్రకారం ఎస్క్రో ఖాతాను తెరవాలని, పనులు పూర్తి చేసి బిల్లులు సమర్పిస్తే యుద్ధప్రాతిపదికన చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

అడ్వాన్స్‌గా బిల్లులు చెల్లిస్తే పనులు ప్రారంభిస్తామని జేపీ అసోసియేట్స్‌ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను మంత్రి ఉత్తమ్‌ తోసిపుచ్చారు. తమ మంచితనాన్ని బలహీనతగా భావించొద్దని..ఒప్పందం ప్రకారమే చెల్లింపులు చేస్తామన్నారు. ఇన్నాళ్లు నిర్మాణ సంస్థ ఏం అన్నా భరించామని, ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. వారం రోజుల్లో డ్రిల్లింగ్‌ బ్లాస్టింగ్‌ పద్ధతిలో పనులు ప్రారంభించాలని తేల్చి చెప్పారు. సమీక్షలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఈఎన్సీ (జనరల్‌) అంజాద్‌ హుస్సేన్, సొరంగాల నిపుణుడు కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా పాల్గొన్నారు.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు