Breaking News

మాకు దక్కాల్సిన వాటా 763 టీఎంసీలు: ఉత్తమ్‌

Published on Wed, 09/24/2025 - 06:03

సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా 763 టీఎంసీలు దక్కాలని, ఈ వాటాను రాబట్టుకునేలా జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు తెలంగాణ వాదనలు వినిపిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. కృష్ణా బేసిన్‌లో తెలంగాణలోని పరీవాహక ప్రాంతం, కరువు ప్రాంతాలు, జనాభా ప్రాతిపదికన వాటాలు ఇవ్వాలని కోరుతున్నట్లు వెల్లడించారు. ‘కృష్ణా నదీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌–2 ఉమ్మడి రాష్ట్రానికి మొత్తంగా 1,050 టీఎంసీల నీటిని కేటాయించింది. 

ఇందులో 75 శాతం డిపెండబులిటీ ఆధారంగా  811 టీఎంసీలు, 65 శాతం డిపెండబులిటీలో 49 టీఎంసీలు, సగటు ప్రవాహాల్లో 145 టీఎంసీలతోపాటు గోదావరి మళ్లింపు జల్లాల్లో 45 టీఎంసీలు కలిపి మొత్తంగా 1050 టీఎంసీలు కేటాయించింది. ఇందులో 70శాతం నీటిని తెలంగాణకు కేటాయించాలని కోరుతున్నాం. అందులో 75శాతం డిపెండబులిటీ కింద 555 టీఎంసీలు, 65 శాతం డిపెండబులిటీ కింద 43 టీఎంసీలు, సగటు ప్రవాహాల కింద 120, గోదావరి మళ్లింపు జల్లాల్లో 45 టీఎంసీలు కలిపి మొత్తంగా 763 టీఎంసీలు కోరుతున్నాం’అని ఉత్తమ్‌ తెలిపారు. మంగళవారం మొదలైన ట్రిబ్యునల్‌ విచారణకు మంత్రి స్వయంగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీకి జరిగిన 811 టీఎంసీలను ఎక్కువగా బేసిన్‌ బయట ఉన్నవాటికే కేటాయించారని, ఈ నీటిని తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు అందించేలా న్యాయం చేయాలని ట్రిబ్యునల్‌ను కోరుతున్నామని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు ఇవ్వాలని లిఖిత పూర్వకంగా రాసిచ్చారని, ఈ అన్యాయాన్ని సవరించాలని తాము కోరుతున్నామని చెప్పారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. 
 
ఆల్మట్టిపై సుప్రీంలో కొట్లాడతాం 
కర్ణాటక నిర్ణయించిన ఆల్మట్టి ఎత్తు పెంపును సైతం తాము అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. ఈ విషయమై త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నా, ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా నీటి వాటాల విషయంలో తెలంగాణ రాజీపడదని, ఎవరితోనైనా కొట్లాడతామని స్పష్టం చేశారు.   

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)