Breaking News

‘మేడిగడ్డ’పై తుది నివేదిక ఇవ్వండి

Published on Wed, 10/09/2024 - 05:27

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేస్తూ తుది నివేదికను వెంటనే అందించాలని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ)కి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు. ఈ నెల 11న ఢిల్లీకి వెళ్లనున్న ఆయన... ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌ అనీల్‌ జైన్, ఇతర అధికారులతో భేటీ కానున్నారు. ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ గతంలో అందించిన మధ్యంతర నివేదికలో చేసిన సిఫారసుల ఆధారంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బరాజ్‌లకు తాత్కాలిక మరమ్మతులు నిర్వహించింది.

అయితే ప్రభుత్వం వివిధ సాంకేతిక పరీక్షలు నిర్వహించి తమకు నివేదికలు సమర్పించాకే తుది నివేదిక ఇస్తామని ఎన్డీఎస్‌ఏ గతంలో స్పష్టం చేసింది. శాశ్వత పునరుద్ధరణ పనులు నిర్వహించే వరకు నీళ్లను నిల్వ చేయరాదని ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ కోరడంతో ప్రస్తుతానికి మూడు బరాజ్‌లు ఉపయోగంలోకి లేవు. మరోవైపు వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి పెరగడం వల్ల కొన్ని పరీక్షలను మాత్రమే నీటిపారుదల శాఖ పూర్తి చేయగలిగింది. వాటికి సంబంధించిన నివేదికలను అధికారులు ఢిల్లీకి వెళ్లి ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీకి అందజేశారు.

సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ మేడిగడ్డ బరాజ్‌ కు పరీక్షలు నిర్వహించి అందించిన నివేదికను సైతం ఎన్డీఎస్‌ఏకు ఇటీవల అప్పగించారు. శాశ్వత పునరుద్ధరణ చర్యలపై తుది నివేదికను అందజేయాలని రాష్ట్ర అధికారులు కోరగా, మిగిలిన పరీక్షలను సైతం పూర్తి చేసి నివేదికలు సమరి్పస్తేనే తుది నివేదిక ఇస్తామని ఎన్డీఎస్‌ఏ అధికారులు తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల విజ్ఞప్తుల కు ఎన్డీఎస్‌ఏ యంత్రాంగం స్పందించకపోవడంతో స్వయంగా ఢిల్లీ వెళ్లాలని మంత్రి ఉత్తమ్‌ నిర్ణయించారు. మంగళవారం సచివాలయంలో ఆయన నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు అనిల్‌కుమార్, నాగేంద్రరావు, హరిరామ్‌లతో సమావేశమయ్యారు. 

మేడిగడ్డకు ప్రత్యామ్నాయాలు.. 
గోదావరికి ఉపనది అయిన వార్దాపై బరాజ్‌తోపాటు ప్రాణహితపై తమ్మిడిహట్టికి దిగువన రబ్బర్‌ డ్యామ్‌ కట్టాలన్న ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ రెండింటి నీళ్లను గ్రావిటీ ద్వారా సుందిళ్ల బరాజ్‌కు తరలించి అక్కడి నుంచి ఎల్లంపల్లి బరాజ్‌లోకి పంపింగ్‌ చేయాలని యోచిస్తోంది. మేడిగడ్డ బరాజ్‌కు ప్రత్యామ్నాయంగా ఈ రెండు బరాజ్‌లు ఉపయోగపడనున్నాయి. మేడిగడ్డకు వెంటనే శాశ్వత మరమ్మతులు సాధ్యం కాకుంటే ప్రత్యామ్నాయాలుగా వాటిని నిర్మించే అంశంపై ఎన్డీఎస్‌ఏతో సమావేశం అనంతరం ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

మూసీ కాల్వలకు సత్వర అనుమతులు.. 
నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన బునాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువ పనులకు  పరిపాలనా అనుమతులు పొందాలని అధికారులను మంత్రి ఉత్తమ్‌ ఆదేశించారు. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, డిండి, దేవాదుల తదితర ఎత్తిపోతల పథకాల పెండింగ్‌ భూసేకరణను వేగంగా పూర్తి చేయాలన్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని సాంకేతిక సలహా మండలి పరిశీలనలో ఉన్న సీతమ్మసాగర్‌ ప్రాజెక్టు డీపీఆర్‌కు వెంటనే ఆమోదం లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమ్మక్కసాగర్‌ బరాజ్‌ నిర్మాణం విషయంలో ఛత్తీస్‌గఢ్‌తో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకొని ఎన్‌ఓసీ పొందడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

త్వరగా ఇంజనీర్లకు పదోన్నతులు
నీటిపారుదల శాఖలో ఇంజనీర్ల పదోన్నతులపై మంత్రి ఉత్తమ్‌ అధికారులతో చర్చించారు. పదోన్నతులపై హైకోర్టులో కేసు సోమవారం కొలిక్కి వచ్చే అవకాశముందని అధికారులు ఆయనకు వివరించారు. ఆ వెంటనే ఇంజనీర్లకు పదోన్నతులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)