Breaking News

అయ్యవారికి దండం పెట్టు..

Published on Mon, 01/13/2025 - 01:57

వేలేరు: సంక్రాంతి పండుగ వచ్చిందంటే గంగిరెద్దుల వారికి పండుగే. బసవన్న కాలికి, మెడకు గజ్జెల పట్టీలు కట్టి.. రంగురంగుల వస్త్రాలతో అందంగా అలంకరించి, కొమ్ములకు రంగులద్ది.. సన్నాయి ఊదుతూ.. ఊరూరా తిరుగుతూ సందడి చేస్తారు. అయితే పండుగ వేళ ఇళ్ల ఎదుట సందడి చేసే గంగిరెద్దుల ఆటలు నేటి ఆధునిక సమాజంలో కనుమరుగవుతున్నాయి. హనుమకొండ జిల్లా వేలేరు మండలం మద్దెలగూడెం గ్రామంలో సుమారు 45 గంగిరెద్దుల వారి కుటుంబాలు నివసిస్తున్నాయి.

వీరికి గంగిరెద్దుల ఆటనే ప్రధాన వృత్తి. తాతల కాలం నుంచి అదే వృత్తిని నమ్ముకుని జీవనాన్ని గడుపుతున్నారు. వీరికి అంతో ఇంతో ఆదాయం వచ్చేది సంక్రాంతి పండుగ సమయంలోనే. మిగతా సమయంలో గంగిరెద్దుల ఆటతో వచ్చే ఆదాయం సరిపోక బతుకుదెరువు కష్టమై కూలి పనులు చేస్తున్నారు. అలాగే ఎవరైనా చనిపోతే దశదినకర్మ సమయంలో వెళ్లి ఆటలు ఆడిస్తూ ఉంటారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ జీవితాల్లో వెలుగులు రావడం లేదని వారు వాపోతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి.. 
తాతల కాలం నుంచి గంగిరెద్దులను ఆడిస్తూనే బతుకుతున్నాం. మాకు ఏ ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు అందలేదు. ఎన్నికలప్పుడు నాయకులు ఓట్లు వేయించుకోవడానికే మా దగ్గరికి వస్తారు. తర్వాత మా ఇళ్లవైపు కన్నెత్తి చూడరు. మా గంగిరెద్దుల కుటుంబాలకు 25 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చింది. ఇప్పుడు అవి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వమైనా మాకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించి ఆదుకోవాలి. – బత్తుల మల్లయ్య

కులవృత్తే జీవనాధారం..
కులవృత్తిలో భాగంగా నా భర్త గంగిరెద్దులను ఆడిస్తాడు. సంక్రాంతికి గంగిరెద్దులను ఆడించడంతో పండుగ ఖర్చులు వస్తాయి. గ్రామాల్లో ఎవరైనా చనిపోతే దశదినకర్మ వద్దకు వెళ్లి గంగిరెద్దులను ఆడిస్తుంటారు. మిగతా సమయాల్లో కూలి, ఇతరత్రా పనులు చేసుకుంటూ పిల్లలను సాదుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఏ సాయమూ లేదు.  – ఆవుదొడ్డి దుర్గమ్మ 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)