Breaking News

వీడియో కాల్‌ కలకలం.. అర్థరాత్రి ఎమ్మెల్యేకు నగ్నంగా ఫోన్‌ కాల్‌

Published on Sat, 10/19/2024 - 08:09

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరస్తులు ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి పొలిటీషియన్‌ వరకు ఏదో రకంగా ఇబ్బందులు పెడుతూ డబ్బులు కాజేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇక, ఇటీవలి కాలంలో వాట్సాప్‌లో నగ్న వీడియో కాల్స్‌ చేసి కొందరు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. తాజాగా తెలంగాణలోని ఓ ఎమ్మెల్యే సైతం ఇదే పరిస్థితి ఏర్పడింది.

వివరాల ప్రకారం.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. ఈ నెల 14న అర్ధరాత్రి దాటిన తర్వాత సదరు ఎమ్మెల్యేకు వీడియో కాల్‌ వచ్చింది. గుర్తుతెలియని నంబర్‌ నుంచి కాల్‌ రావడంతో ఎవరో అనుకుని.. వీడియో కాల్‌ను ఎమ్మెల్యే ఆన్సర్‌ చేశారు. దీంతో ఫోన్‌ స్క్రీన్‌పై ఓ మహిళ నగ్నంగా కనిపించింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే కాల్‌ను కట్‌ చేశారు.

ఈ క్రమంలో వీడియో కాల్‌ నుంచి తేరుకున్న ఎమ్మెల్యే.. నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే గురువారం తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ)లో కూడా ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్‌నంబర్‌ ఎవరిదని కనుక్కునే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

అయితే, తనపై కుట్ర పన్నేందుకు ఎవరైనా అలా వీడియోకాల్‌ చేశారా? లేక నిజంగానే గుర్తుతెలియని వ్యక్తులే చేసి ఉంటారా? అనే అనుమానం ఎమ్మెల్యేకు కలిగింది. తన ప్రతిష్ఠను దిగజార్చడంతోపాటు బ్లాక్‌మెయిల్‌ చేసే ఉద్దేశంతో ఎవరైనా ఈ పనికి పాల్పడి ఉంటారనే సందేహంతో ఆయన వెంటనే నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే గురువారం తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ)లో సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్‌నంబర్‌ ఎవరిదని కనుక్కునే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)