తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

Published on Tue, 11/26/2024 - 17:13

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో నూతన ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తమ హయాంలో వరంగల్ విమానాశ్రయాన్ని నూటికి నూరుపాళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరంగల్‌తో పాటు మరో మూడు (పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్) విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారని తెలిపారు.

పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం విషయంలో ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉందని.. నివేదిక సానుకూలంగా వస్తే తర్వాత భూసేకరణకు వెళ్లొచ్చని రామ్మోహన్‌ నాయుడు చెప్పారు. ఆదిలాబాద్ విమానాశ్రయం రక్షణ శాఖ పరిధిలో ఉంది. ఆ శాఖ నుంచి అనుమతి ఉంటే అక్కడ కూడా విమానాశ్రయాన్ని చేస్తామన్నారు.

‘‘ఆదిలాబాద్‌కు ఓవైపు చత్తీస్‌గఢ్‌, మరోవైపు మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. దరిదాపుల్లో విమానాశ్రయం లేదు. అక్కడ ఏర్పాటు చేస్తే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. వరంగల్ విమానాశ్రయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రో యాక్టివ్‌గా వ్యవహరిస్తూ భూసేకరణకు సర్క్యులర్ జారీ చేసింది. అక్కడ పూర్తిగా ఎయిర్‌ఫోర్ట్‌ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా విమానాశ్రయాన్ని నిర్మించి చూపిస్తాం. విమానయాన శాఖ వల్ల కేవలం విమాన ప్రయాణాలే కాదు.. టూరిజం ఉద్యోగ కల్పన మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి పెరుగుతుంది’’  అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)