Breaking News

కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోనే విమోచన ఉత్సవాలు

Published on Sat, 09/14/2024 - 04:57

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా హైదరాబాద్‌ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. రెండేళ్లక్రితం సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తొలిసారిగా ఈ ఉత్సవాలను కేంద్రం అధికారికంగా నిర్వహించినపుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ వేడుకలకు అమిత్‌షా హాజరవుతారని రాష్ట్ర పార్టీ నేతలు గట్టిగా విశ్వసించారు. అయితే ఈ నెల 17న పరేడ్‌గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన విమోచన వేడుకలు నిర్వహించనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. గతేడాది కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా చారిత్రక గోల్కొండ కోటలో సైనికదళాల పరేడ్‌తో పాటు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించిన విషయం విదితమే.

ఈ ఏడాది కూడా కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఆయనతో పాటు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొననున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం... పారా మిలటరీ దళాలు, సైనిక దళాలు పరేడ్‌ను నిర్వహించనున్నాయి. హైదరాబాద్‌ సంస్థానం విముక్తి కోసం జరిగిన పోరాటానికి సంబంధించిన చారిత్రక అంశాలతో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలను కళాకారులు ఇవ్వనున్నారు. 

ఇదిలా ఉంటే...17న హైదరాబాద్‌ విమోచన సందర్భాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడాన్ని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 17న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వడాన్ని కేంద్రమంత్రి సంజయ్, బీజేఎలీ్పనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. 17న రాష్ట్ర ప్రభుత్వమే విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌తో సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు బీజేపీ శాసనసభాపక్షం సిద్ధమవుతోంది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)