Breaking News

బోనాల ఉత్సవాలకు నిరంతర విద్యుత్‌

Published on Sat, 06/29/2024 - 08:45

హైదరాబాద్‌, సాక్షి: నగరంలో బోనాల సందర్భంగా నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని..  ప్రముఖ ఆలయాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సీజీఎంలు, ఎస్‌ఈలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

జులై 2 నాటికి సంబంధిత సీఈలు/ఏస్‌ఈలు ఆలయ ప్రాంగణాలను సందర్శించి 24 గంటల విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ దేవాలయానికి ఒక నోడల్‌ అధికారి/ఏఈని కేటాయించాలన్నారు. ఆర్‌అండ్‌బీ, ఆలయ కమిటీలతో సమన్వయం చేసుకోవడంతో పాటు డీటీఆర్‌లు, అదనపు లైట్లు, ఎయిర్‌ కండిషనింగ్, సౌండ్‌ సిస్టంకు తగినట్లు విద్యుత్‌ లోడ్‌ ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. 

అవసరమైన చోట ప్రత్యామ్నాయ సామగ్రిని సమకూర్చుకోవాలన్నారు. ప్రజలు గుమిగూడే చోట విద్యుత్‌ స్తంభాలు షాక్‌ కొట్టకుండా ముందే చెక్‌ చేయాలన్నారు. విద్యుత్‌ లీకేజీలను పూర్తిగా అరికట్టాలన్నారు. అన్ని పంపిణీ కేంద్రాల్లోనూ టంగ్‌ టెస్టర్‌ ద్వారా ఎర్తింగ్‌ను చెక్‌ చేయడంతో పాటు ప్రతి గంటకోసారి రీడింగ్‌ తీసుకోవాలన్నారు.  సమావేశంలో ఇన్‌చార్జి డైరెక్టర్లు నందకుమార్, డాక్టర్‌ నర్సింహులు, సీజీఎంలు కె.సాయిబాబా, ఎల్‌.పాండ్య, వి.శివాజీ,  పి.భిక్షపతి, పి.ఆనంద్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)