వైభవంగా సికింద్రాబాద్‌ లష్కర్‌ బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌

Published on Sun, 07/13/2025 - 10:53

సాక్షి, హైదరాబాద్‌: చరిత్రాత్మకమైన సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 4 గంటలకు వేదమంత్రోచ్ఛరణల మధ్య ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ద్వారాలు తెరిచారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ అమ్మవారికి తొలిపూజ చేసి బోనం సమర్పించారు. అనంతరం సాధారణ భక్తులకు అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమ్మవారికి పట్టు వ్రస్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంకు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఈటల రాజేందర్‌ దర్శించుకున్నారు.  అనాదిగా హైదరాబాద్‌లో బోనాల పరంపర కొనసాగుతుందన్నారు.

ఈ నెల 13, 14 తేదీల్లో అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేశారు. ఆదివారం బోనాలు, సోమవారం రంగం కార్యక్రమంలో భాగంగా భవిష్యవాణి ఉంటుంది. తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొనే బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.

అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఆరు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇందులో రెండు క్యూలైన్లు బోనాలతో వచ్చే మహిళల కోసం, ఒకటి వీఐపీ పాస్‌లతో వచ్చే వారికి, మిగతావి సాధారణ భక్తులకు కేటాయించారు. బోనాలతో వచ్చే మహిళలతోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులను అనుమతిస్తారు. దేవదాయ శాఖ అధికారులు దేవాలయం మొత్తం రంగులు, పువ్వులు, విద్యుత్‌ దీపాలతో ముస్తాబు చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు 24 గంటలు పారిశుధ్య పనులు నిర్వహించేలా సిబ్బందిని నిమించారు.

మొబైల్‌ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. జలమండలి అధికారులు ఐదు ప్రాంతాల్లో మంచినీటి శిబిరాలను ఏర్పాటు చేసి వాటర్‌బాటిళ్లు, మంచినీటి ప్యాకెట్లు అందించనున్నారు. మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో డీఎంఅండ్‌హెచ్‌వో ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి డాక్టర్లను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్స్‌లను సిద్ధంగా పెట్టారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో భక్తులను అలరించేందుకు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళాకారులతో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

శివసత్తులు, జోగినుల కోసం అధికారులు ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు వారికి ప్రత్యేకంగా అనుమతిస్తారు. ఆ సమయంలో తమ సంప్రదాయ పద్ధతిలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. బాటా వైపు నుంచి క్యూలైన్లలో కాకుండా నేరుగా ఆర్చ్‌ గేటు వరకు అనుమతిస్తారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)