Breaking News

35 ఏళ్ల స్నేహబంధం.. మిత్రమా, చూసి ఎన్నాళ్లయిందో!

Published on Sat, 10/18/2025 - 08:44

సాక్షి,హైదరాబాద్‌: వారిద్దరూ పోలీసులు ఉన్నతాధికారులు. 1990 బ్యాచ్‌కు చెందిన వీరిద్దరూ ఐపీఎస్‌ అధికారులు. ఎస్‌వీపీ ఎన్‌పీఏలోనే శిక్షణ పొందారు. అప్పటి నుంచి వీరి స్నేహం కొనసాగుతోంది. కాగా.. ఎన్‌పీఏ నుంచి బయటకు వచ్చిన ఐదేళ్లకు బ్యాచ్‌ రీయూనియన్‌లో ఈ ద్వయం కలుసుకున్నారు. ఆపై సమాచార మార్పిడి, ఫోన్‌ ద్వారా సంభాషణలు జరుగుతున్నా ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం వీరికి రాలేదు. అయితే అలాంటి అరుదైన కలయికకు వేదికైంది నగరంలోని శివరాంపల్లిలో ఉన్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడెమీ. (ఎస్‌వీపీ ఎన్‌పీఏ)లో శుక్రవారం ఆ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. అదే అకాడెమీలో 35 ఏళ్ల క్రితం శిక్షణ పొందిన ఈ ఇద్దరు అత్యున్నత అధికారులు 30 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. వీరిలో ఒకరు తెలంగాణ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (డీజీపీ), ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ అంజనీ కుమార్‌ అయితే... రెండో వారు బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ దల్జిత్‌ సింగ్‌ చౌదరి.  

30 ఏళ్ల తర్వాత.. 
శిక్షణ నుంచి బయటకు వచి్చన తర్వాత అంజనీ కుమార్‌ ఆంధ్రప్రదేశ్, దల్జీత్‌ సింగ్‌ ఉత్తరప్రదేశ్‌ క్యాడర్లకు వెళ్లారు. అప్పటి నుంచి వీరి స్నేహం కొనసాగుతోంది. 30 ఏళ్ల తర్వాత శుక్రవారం మళ్లీ ఆ అవకాశం వచి్చంది. ఎస్‌వీపీ ఎన్‌పీఏలో జరిగిన 77వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు దల్జీత్‌ సింగ్‌ చౌదరిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న అంజనీకుమార్‌ సైతం ఎస్‌వీపీ ఎన్‌పీఏకు వెళ్లారు. అక్కడ వీరిద్దరూ ఇతర పోలీసు అధికారులకు సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ అయ్యారు.

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)