Breaking News

చిన్నారి ప్రాణం తీసిన తోపులాట?

Published on Sun, 02/22/2026 - 04:12

నాగర్‌కర్నూల్‌ క్రైం: దేవుడి దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. ఆలయ నిర్వాహకులు, కుటుంబ సభ్యులకు మధ్య జరిగిన తోపులాటలో కిందపడిన రెండు నెలల చిన్నారి మూ డురోజుల అనంతరం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెర గ్రామంలో ఈ నెల 18న  మల్లన్న జాతర జరుగుతుండగా ఇదే గ్రామానికి చెందిన చంద్రకళ తన కూతురు కీర్తి, కుమారుడు గణేష్, కోడలు మౌనికతోపాటు రెండు నెలల చిన్నారి (మనుమరాలు)తో కలిసి మల్లన్న దర్శనానికి వెళ్లింది. 

అయితే జాతర నిర్వాహకులు దర్శనానికి రూ.వంద చెల్లించాలని కోరగా నిరాకరించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కొందరు జాతర నిర్వాహకులు గణేష్, చంద్రకళను కొబ్బరికాయల రూంలోకి తీసుకెళ్లి గణేష్‌ను చితకబాదారు. కొబ్బరికాయల రూంలో దాడి చేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. కొబ్బరి కాయల రూం బయట ఉన్న చంద్రకళ కోడలు మౌనిక, రెండు నెలల మనుమరాలు, కూతురు కీర్తి గణేష్‌ను కొట్టవద్దని అడ్డు వెళ్లగా జాతర నిర్వాహకులు తోసివేయ డంతో రెండు నెలల చిన్నారితో సహా అందరూ కిందపడిపో యారు. 

ఈ క్రమంలోనే చిన్నారికి అంతర్గతంగా గాయాలయ్యాయని బాధితులు ఆరో పించారు. అయితే శనివారం ఉదయం ఇంట్లోనే చిన్నారి అనుమానా స్పద స్థితిలో మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆలయ నిర్వాహకులు దాడి చేయ డంతోనే చిన్నారి మృతి చెందిందని ఫిర్యాదు చేశారు.  ఎస్‌ఐ గోవర్ధన్‌  అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

జిల్లా ఆస్పత్రి ఎదుట ధర్నా
బాధిత కుటుంబసభ్యులను డీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్‌ మహారాజ్‌ పరామర్శించి బాధితులకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)