Breaking News

శాసనసభలో సెల్‌ఫోన్లు వాడొద్దు

Published on Fri, 02/16/2024 - 04:00

సాక్షి, హైదరాబాద్‌: శాసనస సభ స్పీకర్‌ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి సభలో సభ్యులెవరూ సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ఇతర ఎల్రక్టానిక్‌ గ్యాడ్జెట్స్‌ను వినియోగించకూడదని రూలింగ్‌ ఇచ్చారు. వాటిని ఉపయోగించి వీడియోలు ప్రదర్శించకూడదని ఆదేశించారు. ‘కృష్ణా నది మీద నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్‌ఎంబీకి అప్పగించే అంశం’మీద సభలో ఇటీవల జరిగిన చర్చ సందర్భంగా అధికార–ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన విషయం తెలిసిందే.

కేఆర్‌ఎంబీకి తాము ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత అప్పగించటం లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన సమయంలో, ఆ నిర్ణయానికి భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించిన అప్పటి నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ (ప్రస్తుతం మాజీ) మురళీధర్‌రావు పేర్కొన్నట్టుగా ఉన్న వీడియోను ఫోన్‌ ద్వారా ప్రదర్శించారు. ఇది ప్రభుత్వాన్ని కొంత ఇ రుకున పెట్టింది. ఈ నేపథ్యంలో సభలో ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ వినియోగంపై గురువారం స్పీకర్‌ నిర్ణ యం వెల్లడించటం విశేషం. స్పీక ర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా సభలో వాటిని వినియోగించవద్దని స్పష్టం చేశారు. 

మీడియా పాయింట్‌ వద్ద కూడా
ఇక సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మీదట బీఆర్‌ఎస్‌ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారు మీడియాతో మాట్లాడేందుకు సభ ఆవరణలోని మీడియా పాయింట్‌ వద్దకు వస్తుండగా భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. సభ జరుగుతున్న తరుణంలో మీడియా పాయింట్‌ వద్ద మీడియా సమావేశానికి అనుమతి లేదంటూ వారు పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ బీఆర్‌ఎస్‌ సభ్యులు నేలమీద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సభ ప్రారంభం అవుతూనే స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ కీలక ప్రకటన చేశారు. సభ జరుగుతున్న తరుణంలో సభా ప్రాంగణంలో మీడియా పాయింట్‌ వద్ద విలేకరుల సమావేశానికి అనుమతి లేదని, టీ, లంచ్‌ విరామ సమయాల్లో, సభ వాయిదా పడ్డ తర్వాత యధావిధిగా మీడియా పాయింట్‌ వద్ద మీడియాతో మాట్లాడవచ్చని పేర్కొన్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)