Breaking News

అత్తా కోడళ్ల పంచాయితీ.. ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

Published on Mon, 04/21/2025 - 11:38

జనగామ జిల్లా: అత్తా కోడళ్లు కొట్టుకున్న వివాదంలో డబ్బులు డిమాండ్‌ చేసిన హెడ్‌ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తూ వరంగల్‌ పోలీసు కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన అత్తాకోడళ్లు ఎదునూరి లచ్చవ్వ, ఎదునూరి మంజుల నల్లా నీటి విషయంలో ఈనెల 15న గొడవపడ్డారు.

 ఈ ఘటనలో ఎదునూరి లచ్చవ్వ తలకు గాయాలయ్యాయి. దీంతో బాధితురాలు తన చిన్న కోడలు మంజుల, కుమారుడు నాగరాజుపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో హెడ్‌కానిస్టేబుల్‌ గుగులోతు బాలోజి, కానిస్టేబుల్‌ నునావత్‌ రాజు నాగరాజుకు ఫోన్‌చేసి కేసు నమోదు చేయవద్దంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

ఈ విషయాన్ని నాగరాజు గ్రామానికి చెందిన వ్యక్తికి తెలుపగా.. వీరి మధ్య సంభాషణను రికార్డుచేసి... కమిషనర్‌కు పంపించి చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ చేపట్టిన సీపీ డబ్బులు డిమాండ్‌ చేసినట్లు తేలడంతో బాలోజి, రాజును సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)