Breaking News

HYD: ప్రేమ జంటకు ఆశ్రయమిస్తే కటకటాల్లోకే!

Published on Fri, 07/25/2025 - 13:01

ఫిలింనగర్‌: ప్రేమ జంటకు ఆశ్రయం ఇచ్చినందుకు యువతీ, యువకులను ఫిలింనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే ప్రేమజంట మధ్య విబేధాలు రావడంతో సదరు బాలిక ఫిలింనగర్‌ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆమె మైనర్‌ కావడంతో ఆమె ప్రియుడిని  ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో భాగంగా బాధితురాలు తమకు ఫిలింనగర్‌లోని బీజేఆర్‌నగర్‌లో నివసించే కోనె అఖిల్‌ అనే యువకుడు తన గదిలో ఆశ్రయం ఇచి్చనట్లు చెప్పింది. 

దీంతో బాలికతో పాటు ఆమె ప్రియుడికి చట్టవిరుద్ధంగా గదిని ఇచ్చినందుకుగాను పోలీసులు కోనె అఖిల్, అతడికి సహాయపడిన నిఖిత అనే యువతిని గురువారం అరెస్టు చేశారు. బీజేఆర్‌నగర్‌ బస్తీకి చెందిన యువకుడు, మైనర్‌ బాలిక ప్రేమించుకున్నారు. వీరిద్దరూ తరచూ కలుసుకునేందుకు అఖిల్‌ పలుమార్లు తన గదిని ఇచ్చాడు. అంతేగాక ఇదే బస్తీలో నివసించే నిఖిత అనే యువతి కూడా వీరికి పలుమార్లు ఆశ్రయం కల్పించింది. ఇలా గదులు ఇవ్వడం చట్టవిరుద్ధం కాగా,  బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గదులు ఇచ్చిన వారిని కూడా నిందితులుగా చేర్చి అరెస్టు చేశారు.

 బస్తీల్లో, కాలనీల్లో, అపార్ట్‌మెంట్లలో ఎవరైనా స్నేహితులకు తమ గదులను ఇస్తే వారిపై కూడా  కేసులు  నమోదు చేస్తామని ఫిలింనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సంతోషం హెచ్చరించారు. ముఖ్యంగా ఫిలింనగర్‌ 18 బస్తీల్లో కొందరు   ప్రేమ జంటలకు తమ గదులను వాడుకునేందుకు ఇస్తున్నట్లుగా ఫిర్యాదులు అందుతున్నాయని, వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. ఇళ్ల యజమానులు తమ ఇళ్లల్లో అద్దెకు ఉంటున్న వారి ఇంటికి ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో తెలుసుకుని అనుమానాస్పదంగా ఉంటే బయటకు పంపించాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.  

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)