Breaking News

టీవీ సీరియల్‌ నటికి వేధింపులు...

Published on Tue, 12/31/2024 - 07:26

బంజారాహిల్స్‌ : నా మాట వినకున్నా..నాతో కలవకున్నా..నన్ను పెళ్లి చేసుకోకున్నా..ఈ సంక్రాంతికి నీ ఫొటోలన్నీ బ్యానర్లుగా చేసి ఊరంతా కడతానంటూ టీవీ సీనియర్‌ నటిని వేధిస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..వెస్ట్‌ గోదావరి జిల్లా, కవటం గ్రామానికి చెందిన మహిళ (29)   శ్రీకృష్ణానగర్‌లో ఉంటుంది. 

ఆమెకు 2012లో కృష్ణమోహన్‌ అనే వ్యక్తితో పెళ్లి కాగా కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గత రెండేళ్లుగా భర్తకు దూరంగా పిల్లలతో కలిసి కృష్ణానగర్‌లో ఉంటోంది. గత సెపె్టంబర్‌ నుంచి శ్రావణ సంధ్య అనే సీరియల్‌లో నటిస్తుంది. ఈ సందర్భంగా బత్తుళ్ల ఫణితేజ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. 

గత నెలలో పెళ్లి చేసుకుంటానని చెప్పగా, అందుకు ఆమె నిరాకరించింది. అప్పటి నుంచి అసభ్యకరమైన మెసేజ్‌లు, వీడియోలు పెట్టడమే కాకుండా టీవీ ఇండస్ట్రీలో తాను వివిధ వ్యక్తులతో దిగిన ఫొటోలను చెడుగా ప్రచారం చేస్తున్నాడు.  తనతో ఉండడానికి ఒప్పుకోకపోతే ఈ ఫోటోలతో సంక్రాంతికి ఆమె స్వ గ్రామంలో బ్యానర్లు కడతానని బెదిరిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు ఫణితేజపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య