Breaking News

25లోగా రైతు భరోసా

Published on Sat, 06/14/2025 - 04:27

సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలోని రైతులకు ఈ నెల 25వ తేదీలోగా ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చేనెల చివరి వరకు రైతులకు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, మిగతావి ఆగస్టు తర్వాత వస్తాయని తెలిపారు. బోనస్‌ ప్రకటన తర్వాత రాష్ట్రంలో సన్న ధాన్యం సాగు పెరిగిందని చెప్పారు.

ఇతర దేశాల్లో డిమాండ్‌ ఉన్న ఆరు రకాల వరి రాష్ట్రంలో సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆయిల్‌పామ్‌ రైతులకు టన్నుకు రూ.25 వేలు తగ్గకుండా కనీస మద్దతు ధర కోసం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రానికి లేఖలు పంపించి, త్వరలోనే ప్రధానమంత్రిని కలుస్తామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని, అందులో తాను కూడా ఉన్నానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ తదితరులు చెపుతున్న మాటలన్నీ అబద్ధమని మంత్రి తుమ్మల అన్నారు. కేబినెట్‌ సబ్‌ కమిటీ వేయడానికి 15 రోజుల ముందుగానే మేడిగడ్డ బరాజ్‌ మంజూరైందని తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)