Breaking News

రైతు రుణాలను రికవరీ చేయండి

Published on Fri, 01/19/2024 - 02:26

సాక్షి, హైదరాబాద్‌: రైతు రుణాలను రికవరీ చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లు, ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాల (ప్యాక్స్‌)ల్లో ఉన్న రుణాల మొండి బకాయిలు, వ్యవసాయేతర రుణాలను తీర్చని వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. అలాగే వారం రోజుల్లో  రుణాలను తీర్చని రైతులపై, రు ణాలను రికవరీ చేయని అధికారులపైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. డీసీసీబీ, ప్యాక్స్‌ల్లో పాత రుణాల బకాయిలపై గురువారం మంత్రి తుమ్మల సమీక్ష చేశారు. రుణాలను నియమాల ప్రకారం ఆమోదించాలని ఆదేశించారు.

నిజామాబాద్‌ పర్యటనలో రైతులు ఇచ్చిన వినతిపత్రాలపై కూడా ఈ సమీక్షా సమావేశంలో ఆయన స్పందించారు.ప్యాక్స్‌లను బలోపేతం చేయండి: ప్యాక్స్‌ల్లో నిబంధనలకు విరుద్ధంగా తీసు కున్న రుణాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) ఎండీని మంత్రి తుమ్మల ఆదేశించారు. ప్యాక్స్‌ లను బలోపేతం చేయాలని సూ చించిన ఆయన రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులను సిద్ధంగా ఉంచాలన్నారు. గ్రామ స్థాయి వరకు చేర్చే ప్రణాళికను మార్క్‌ఫెడ్‌ అమలు చేయా లనీ, ఎరువుల కంపెనీలతో చర్చించాలని సూచించారు. రైతులకు ఎరువుల పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన స్థాయిలోఎరువులు అందుబాటులో ఉ న్నందున రైతులు ఎటువంటి ఆందోళనకు గురికా వాల్సిన అవసరం లేదని తుమ్మల భరోసానిచ్చారు.

తుమ్మల ఆదేశాలపై చర్చ
కాగా, మంత్రి తుమ్మల రుణ వసూళ్ల ఆదేశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రైతులు తీసుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతోపాటు వ్యవసా యేతర రుణ బకాయిలు పేరుకుపోతే కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలపై వ్యవసాయశాఖలోనూ చర్చకు తెరలేపింది. రైతులు బకాయిలపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని డీసీసీబీ, టెస్కాబ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)