Breaking News

ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం: మంత్రి తుమ్మల

Published on Mon, 03/24/2025 - 01:47

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికి రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రూ.2 లక్షల వరకున్న పంట రుణాలన్నింటినీ మాఫీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. 25,35,964 మంది రైతులకు సంబంధించిన రూ.20,616.89 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

వివిధ కారణాల వల్ల రుణమాఫీకి నోచుకోని అర్హులైన రైతులను ఈ పథకం కిందకి తీసుకొచ్చే విధంగా 3 నెలల పాటు అధికారులు ఇంటింటికి తిరిగి సమాచారం సేకరించి, చివరి విడతగా 3,13,896 మంది రైతులకు రూ. 2,747.67 కోట్లు రుణమాఫీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రెండుసార్లు రుణమాఫీ పేరుతో రైతులను వంచించిన తీరును తెలంగాణ సమాజం గుర్తించిందని పేర్కొన్నారు.

2014లో రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి, అందుకోసం నాలుగు సంవత్సరాల సమయం తీసుకున్న చరిత్ర బీఆర్‌ఎస్‌దని అన్నారు. విడతల వారీగా రుణమాఫీ చేయడం వల్ల రైతులపై రూ. 2,630 కోట్ల అధిక వడ్డీ భారం పడిందని గుర్తు చేశారు.      

గ్రామాలవారీ పంట నష్టం వివరాలివ్వండి  
రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో సంభవించిన వడగండ్ల వాన, ఈదురుగాలుల కారణంగా జరిగిన పంటనష్టంపై వివరాలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వెంటనే గ్రామాలవారీ పంట నష్టంపై సర్వే చేసి వివరాలు అందజేయాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, ప్రస్తుతానికి అందిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 11వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. తుమ్మల తాజా ఆదేశాలతో పూర్తి స్థాయి పంటనష్టం వివరాలు సేకరించే పనిలో వ్యవసాయ శాఖ యంత్రాంగం నిమగ్నం కానుంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)