Breaking News

రేషన్‌కార్డు లేకపోయినా రుణమాఫీ

Published on Wed, 07/17/2024 - 05:09

సాక్షి, హైదరాబాద్‌: రేషన్‌కార్డు లేకపోయినా బ్యాంకుల నుంచి స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్న కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. రేషన్‌కార్డు కేవలం కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమేనని చెప్పారు. ఈ నెల 18న సీఎం రేవంత్‌రెడ్డి 11.50 లక్షల మందికి సంబంధించిన లక్షలోపు రుణాలు దాదాపు రూ.6,800 కోట్లు ఒకేసారి మాఫీ చేస్తారని తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 

గత ప్రభుత్వ మార్గదర్శకాలే.. 
‘రుణమాఫీకి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరించిన మార్గదర్శకాలనే పాటించాలని నిర్ణయించాం. కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నారని నిర్ధారించేందుకు రేషన్‌కార్డు ఒక్కటే ప్రామాణికం. ఒక కుటుంబంలో ఎంతమంది వ్యవసాయ రుణాలు తీసుకున్నారో గుర్తించేందుకే ఇది తప్పనిసరి.  రేషన్‌కార్డులు లేని రుణ ఖాతాలు 6 లక్షల వరకు ఉన్నాయి. ఇలాంటి రైతుల ఇళ్లకు అధికారులు వెళ్లి పరిశీలించిన తర్వాత అర్హులను ఎంపిక చేసి రుణమాఫీ చేస్తారు. రేషన్‌కార్డులు లేనివారికి రుణమాఫీ జరగదని చేస్తున్న ప్రచారం తప్పు.రేషన్‌కార్డు లేకున్నా రుణమాఫీ జరుగుతుంది..’అని తుమ్మల వివరణ ఇచ్చారు.

ఆ రుణాలు మాఫీ కావు: ‘బ్యాంకుల్లో బంగారంతో పాటు పాస్‌బుక్‌ తాకట్టుపెట్టి తీసుకున్న స్వల్పకాలిక రుణాలను కూడా మాఫీ చేస్తాం. కానీ కేవలం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల మాఫీ కావు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకాన్ని ఆదాయం పన్ను చెల్లించే బడా వ్యక్తులను గుర్తించేందుకు వినియోగించుకుంటాం. ఆదాయపు పన్ను చెల్లించే వ్యాపారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సివిల్‌ సర్వీసెస్, గ్రూప్‌ 1,2,3 ఉద్యోగాల్లో ఉన్న అధికారులకు రుణమాఫీ ఉండదు. నెలకు లక్ష రూపాయలకు పైన వేతనం పొందేవారికి రుణమాఫీ వర్తించదు. ఇలాంటివి 17 వేల అకౌంట్లను గుర్తించాం. మహిళా గ్రూపు అప్పులకు మాఫీ వర్తించదు’అని మంత్రి చెప్పారు.

రీషెడ్యూల్డ్‌ రుణాలు కూడా ..
‘గత ప్రభుత్వంలో తొలి విడత లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు విడతల్లో చేశారు. రెండో విడత ప్రభుత్వంలో ఎన్నికల ముందు సగం మందికే మాఫీ చేశారు. వివిధ కారణాల వల్ల రూ.1,400 కోట్లు రైతుల ఖాతాల్లో పడకుండా వెనక్కు వచ్చాయి. రుణమాఫీ కాని రైతులు బ్యాంకుల్లోని తమ అప్పును రీషెడ్యూల్‌ చేసుకున్నారు.

ఇలాంటి వారు కూడా ఈసారి రుణమాఫీ పొందనున్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్నా రూ.2 లక్షల వరకు మాఫీ అవుతాయి. రూ. 2 లక్షల కన్నా ఎక్కువ రుణాలు పొందితే కేవలం రూ.2 లక్షలు మాత్రమే మాఫీ అవుతుంది. అందులో మహిళలకు తొలి ప్రాధాన్యతనిస్తాం. రాష్ట్రంలో 39 లక్షల కుటుంబాలకు సంబంధించి 60 లక్షల రుణ ఖాతాలు ఉన్నాయి..’అని తుమ్మల తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)