సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు

Published on Sat, 01/06/2024 - 03:23

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ రద్దీని తట్టుకునేందుకు అదనంగా 4,484 బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇది గతేడాది సంక్రాంతి సందర్భంగా నడిపిన ప్రత్యేక బస్సుల సంఖ్య కంటే దాదాపు 200 అదనం. కానీ, తెలంగాణ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 1,500 ప్రత్యేక బస్సులు అవసరమని గుర్తించినప్పటికీ, కేవలం 600 సర్వీసులను మాత్రమే తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఉండటంతో బస్సులో విపరీతమైన రద్దీ పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఉన్న బస్సులు సరిపోవటం లేదు. ఇప్పటికిప్పుడు కొత్త బస్సులు అందే అవకాశం లేకపోవటంతో పండగ ప్రత్యేక బస్సుల్లో సింహభాగం తెలంగాణ ప్రాంతంలోనే నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఏపీకి నడిపేందుకు చాలినన్ని బస్సులు లేకపోవటంతో, డిమాండులో సగానికంటే తక్కువ బస్సులతోనే సరిపుచ్చాలని నిర్ణయించినట్టు తెలిసింది. 

626 సర్విసులకు రిజర్వేషన్‌ సౌకర్యం 
ఇప్పుడు నడిపే 4,484 ప్రత్యేక బస్సుల్లో 626 సర్విసుల్లో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈనెల ఏడో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి నేపథ్యంలో, సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో కూడా రద్దీ విపరీతంగా ఉండనున్నందున.. ఎక్కువ ఎక్స్‌ప్రెస్‌ బస్సులతో పాటు పల్లెవెలుగు బస్సులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. 

ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సమీక్ష 
ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ శుక్రవారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఉన్నతాధికారులతో సమీక్షించి ప్రత్యేక బస్సుల నిర్వహణ, ‘మహాలక్ష్మి’రద్దీని తట్టుకునే చర్యలపై చర్చించారు. ఎంజీబీఎస్, జేబీఎస్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, ఉప్పల్, ఆరాంఘర్, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌ ప్రాంతాలలో ప్రత్యేక బస్సులు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నందున ఆయా ప్రాంతాలకు సిటీ బస్సులను కూడా అదనంగా తిప్పాలని నిర్ణయించారు.

ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా జమయ్యే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో నీడ కోసం షామియానాలు, మంచినీటి వసతి, కుర్చిలను సిద్ధం చేయాలని, ప్రయాణికుల సందేహాలను తీర్చే వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రద్దీ ప్రాంతంలో ఇద్దరు డీవీఎం ర్యాంక్‌ అధికారులను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లో అదనంగా ఎలాంటి చార్జీ ఉండదని, సాధారణ టికెట్‌ చార్జీలే వర్తిస్తాయని తెలిపారు. 

ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు 1,450 
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రెగ్యులర్‌ సర్విసులకు అదనంగా 1,450 బస్సులు తిప్పుతున్నట్టు ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈనెల 10 నుంచి 13 వరకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇవి తిరుగుతాయని పేర్కొన్నారు. వీటిల్లోనూ సాధారణ చార్జీలే వసూలు చేస్తారని, ఎలాంటి అదనపు చార్జీలుండవని తెలిపారు. రద్దీ నేపథ్యంలో 11వ తేదీ నుంచి 13 వరకు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు , మాచర్ల వైపు వెళ్లే బస్సులు ఎంజీబీఎస్‌కు బదులు, దాని ఎదురుగా ఉన్న ఓల్డ్‌ సీబీఎస్‌ (గౌలిగూడ బస్టాండు)లో ఆగుతాయని వెల్లడించారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)