Breaking News

TSRTC: మహిళలకు శుభవార్త.. రూ.80కే సిటీ మొత్తం చుట్టేయొచ్చు!

Published on Mon, 05/08/2023 - 21:11

సాక్షి, హైదరాబాద్‌: మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళల ఆర్థికభారం తగ్గించేందుకు వారికి టీ-24 టికెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్‌ ధరను సాధారణ ప్రయాణికులకు రూ.90గా, సీనియర్‌ సిటిజన్లకు రూ.80గా ఇటీవల టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తగ్గించింది. తాజాగా మహిళా ప్రయాణికులకూ రూ.10 తగ్గించి రూ.80కే అందించాలని నిర్ణయించింది.

ఈ కొత్త టి-24 టికెట్‌ ధర మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తుంది. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి. అనూహ్య స్పందన ప్రయాణికుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అందుబాటులోకి  తెచ్చిన టి-24 టికెట్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ తెలిపారు. ''సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్‌ ధరను రూ.100 నుంచి రూ.90కి సంస్థ ఇటీవల తగ్గించింది.

కొత్తగా సీనియర్‌ సిటీజన్లకు రూ.80కే ఆ టికెట్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు టి-24 టికెట్లను ఎక్కువగా కొనుగోలు చేసి బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఆ ధర తగ్గింపు తర్వాత ప్రతి రోజు సగటున 40 వేల వరకు టి-24 టికెట్లు అమ్ముడవుతున్నాయి. గతంలో రోజుకి 25 వేలు మాత్రమే ఉండే ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళా ప్రయాణికులకు మరింతగా దగ్గరఅయ్యేందుకు రూ.80కే టి-24 టికెట్‌ అందించాలని సంస్థ నిర్ణయించింది." అని వారు పేర్కొన్నారు.   మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం టి-6 టికెట్ ను ఇటీవల ప్రారంభించామని, రూ.50 కి ఆ టికెట్ ను కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారు ప్రయాణించవచ్చని చెప్పారు.

అలాగే, కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్ ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. వీకెండ్స్‌, సెలవు రోజుల్లో రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో తీసుకువచ్చిన టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తోన్న టీఎస్ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని కోరారు. సంస్థ ఏ కార్యక్రమం తీసుకువచ్చిన ప్రజలు ప్రోత్సహిస్తున్నారని, వారి ఆదరణ మరువలేనిదని సంస్థ చైర్మన్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు.

(చదవండి: TS: జేపీఎస్‌లకు ప్రభుత్వం నోటీసులు.. జాబ్స్‌ నుంచి తొలగిస్తాం!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)