Breaking News

TSRTC: పల్లె వెలుగులు ఎక్కువగా వాడుకోండి: సజ్జనార్‌

Published on Sat, 12/23/2023 - 08:43

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద.. మహిళలకు అందుబాటులోకి తెచ్చిన ఉచిత ప్రయాణ సదుపాయం పలు ఇబ్బందులకు కారణం అవుతోంది. సోషల్‌ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతుండడం చూస్తున్నాం. మరోవైపు ఫ్రీ జర్నీ కల్పిస్తూనే.. బస్సుల సంఖ్యను తగ్గించదనే విమర్శ టీఎస్‌ ఆర్టీసీ ఎదుర్కొంటోంది. అయితే అలాంటిదేం లేదని.. బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ఆర్టీసీ చెబుతోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మరో ఒక ప్రకటన చేశారు.

ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని.. అయితే అది మరోలా ఉంటోందని చెబుతున్నారాయన. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అన్నారాయన. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కోరుతూ ఓ వీడియోను ఉంచారు. 

మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతోందని అన్నారయన. ఇక నుంచి ఎక్స్‌ ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని, దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)