Breaking News

అక్టోబర్‌ రెండో వారంలో గ్రూప్‌–3 పరీక్షలు! 

Published on Tue, 08/08/2023 - 09:52

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–3 పరీక్షల నిర్వహణకు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కసరత్తు ముమ్మరం చేసింది. గతేడాది డిసెంబర్‌లో గ్రూప్‌–3 కేటగిరీలో 1,363 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ, ఫిబ్రవరి 23వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 5,36,477 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో ఉద్యోగానికి సగటున 390 మంది పోటీ పడుతున్నారు.

తాజాగా ఈ పరీక్షల నిర్వహణపై దృష్టిపెట్టిన కమిషన్‌.. అక్టోబర్‌ రెండో వారంలో నిర్వహించాలని భావిస్తోంది. గ్రూప్‌–1 ప్రిలిమ్స్, గ్రూప్‌–4 పరీక్షలను పూర్తి చేసిన టీఎస్‌పీఎస్సీ, గ్రూప్‌–2 పరీక్షలకు సంబంధించి ఇదివరకే తేదీని ప్రకటించింది. గ్రూప్‌–3 ఉద్యోగాలకు మూడు దశల్లో అర్హత పరీక్షలుంటాయి. పేపర్‌–1 జనరల్‌ స్టడీస్, జనరల్‌ ఎబిలిటీస్, పేపర్‌–2 హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ, పేపర్‌–3 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇందులో భాగంగా ఉంటాయి.

ఒక్కో పరీక్షను రెండున్నర గంటల పాటు నిర్వహిస్తారు. అలాగే ఒక్కో పరీక్షకు గరిష్టంగా 150 మార్కులుంటాయి. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇతర ఉద్యోగ పరీక్షలకు ఆటంకం లేకుండా గ్రూప్‌–3 తేదీలను నిర్ణయించే అంశాన్ని కమిషన్‌ పరిశీలిస్తోంది. ఈ కసరత్తు తర్వాత అతి త్వరలో పరీక్షల తేదీలను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.    

#

Tags : 1

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)