టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో గ్రూప్‌–4 జవాబు పత్రాలు

Published on Tue, 08/29/2023 - 05:06

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్‌–4 పరీక్షల ప్రాథమిక ‘కీ’లను తన వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా గ్రూప్‌–4 పరీక్షలకు హాజరైన అభ్యర్థుల జవాబుపత్రాల స్కానింగ్‌ కాపీలను సైతం అభ్యర్థుల కోసం వెబ్‌సైట్‌లో ఉంచింది.

వీటిని వచ్చే నెల 27వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో పరిశీ­లించుకోవచ్చు. ఈ జవాబు పత్రాలు ని­ర్ణిత గడువు తర్వాత వెబ్‌సైట్‌లో తెరుచుకోవని కమిషన్‌ స్పష్టం చేసింది. దాదాపు 9 వేల గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ జూలై 1న ఉదయం, మధ్యా­హ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించిన సంగ­తి తెలిసిందే.

రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఓఎం­ఆర్‌ పద్ధతిలో గ్రూప్‌–4 పరీక్షలు జరిగా­యి. ఈ పరీక్షల్లో పేపర్‌–1కు 7,63,835 మంది అభ్యర్థులు హాజరు కాగా, పేపర్‌–2 పరీక్షకు 7,61,026 మంది హాజరయ్యారు. 

కమిషన్‌ వెబ్‌సైట్‌లో ప్రాథమిక కీలు 
పరీక్షలకు హాజరైన అభ్యర్థుల జవాబు పత్రాలను స్కానింగ్‌ చేసిన కమిషన్‌... వాటిని అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచింది. నెల రోజుల పాటు వీటిని వెబ్‌సైట్‌ తెరిచి పరిశీలించుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్‌–4 పరీక్షల ప్రాథమిక కీలు సోమవారం నుంచి కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి.

ఈ ప్రాథమిక కీల పైన ఏవేనీ అభ్యంతరాలుంటే ఈనెల 30వ తేదీనుంచి సెప్టెంబర్‌ 4వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు నిర్దేశిత లింకు ద్వారా ఆన్‌లైన్‌ పద్ధతిలో తగిన ఆధారాలతో సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాలను కేవలం ఇంగ్లీషులో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.

నిర్దేశించిన గడువు తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని, ఈమెయిల్, పోసు ద్వారా వచ్చే వినతులను సైతం పరిగణించమని, మరిన్ని వివరాలను వెబ్‌సైట్‌ తెరిచి చూసుకోవాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)