Breaking News

మీరు గెలిచారు.. మమ్మల్నీ గెలిపించండి

Published on Wed, 11/12/2025 - 08:09

హైదరాబాద్‌: గ్రూప్‌ వన్, టూ, ఫోర్‌ అభ్యర్థులు మీరు గెలిచారు.. మమ్మల్నీ గెలిపించండి అంటూ గ్రూప్‌ త్రీ అభ్యర్థులు వేడుకుంటున్నారు. గ్రూప్‌ వన్, టూ, ఫోర్, జేఎల్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల్లో ఇప్పటికే సెలెక్ట్‌ అయ్యి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ తీసుకున్న అభ్యర్థులు గ్రూప్‌ త్రీకి కూడా దరఖాస్తు చేసుకుని, వెబ్‌ ఆప్షన్‌ ఇచ్చినవారు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రావొద్దని వేడుకున్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రూప్‌ త్రీకి సెలెక్ట్‌ అయిన అభ్యర్థులు వినయ్‌ కుమార్, మధు, మోహన్‌ కృష్ణ, వెంకటేష్‌ మాట్లాడారు. 

గ్రూప్‌ వన్‌లో సెలెక్ట్‌ అయిన అభ్యర్థులు సుమారు 100 మంది వరకు గ్రూప్‌ త్రీకి కూడా దరఖాస్తు చేసుకున్నారని, గ్రూప్‌ టూలో సెలెక్ట్‌ అయిన అభ్యర్థులు సుమారు 400 మంది గ్రూప్‌ త్రీకి కూడా దరఖాస్తు చేసుకున్నారని, వీరు ఇప్పటికే సెలెక్ట్‌ అయ్యి, అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ కూడా తీసుకున్నారన్నారు. గ్రూప్‌ త్రీ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ జరుగుతున్న నేపథ్యంలో గ్రూప్‌ వన్, గ్రూప్‌ టూ, గ్రూప్‌ ఫోర్, జేఎల్, సబ్‌ ఇన్‌స్పెక్టర్, డీఎల్‌లో సెలెక్ట్‌ అయిన అభ్యర్థులు గ్రూప్‌ త్రీ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు వచ్చి ఉద్యోగంలో చేరకపోతే ఆ పోస్టు బ్యాక్‌లాగ్‌గానే మిగిలి పోతాయని, గ్రూప్‌ త్రీ సెలెక్ట్‌ అయిన వారు తమ కడుపు కొట్టినవారు అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)