Breaking News

సమ్మె కొనసాగిస్తున్న జేపీఎస్‌లు

Published on Thu, 05/11/2023 - 03:38

సాక్షి, హైదరాబాద్‌: తమ నిరవధిక సమ్మెను కొనసాగించాలని జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ(జేపీఎస్‌)లు నిర్ణయించారు. గురువారానికి వారి సమ్మె 14వ రోజుకు చేరుకోనుంది. తెలంగాణ పంచాయత్‌ సెక్రటరీ ఫెడరేషన్‌ (టీఎస్‌పీఎఫ్‌) అధ్యక్ష బాధ్యతల నుంచి రాజేశ్వర్‌ రావు తప్పుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎ.శ్రీకాంత్‌గౌడ్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

బుధవారం వివిధ జిల్లాల నుంచి వచ్చి న జేపీఎస్‌లు సమావేశమైన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఏదో ఒక హామీ వచ్చే వరకు సమ్మెను కొనసాగించాలని తీర్మానించారు. శ్రీకాంత్‌గౌడ్‌ మాట్లాడుతూ...’’మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. మా డిమాండ్లపై సాను­కూలంగా స్పందిస్తే వెంటనే విధుల్లో చేరి మరింత ఉత్సాహంగా పనిచేస్తాం.

జేపీఎస్‌ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వస్తున్న ఫేక్‌ మేసేజ్‌లు నమ్మకండి. జిల్లా అధ్యక్షులు పంపించే మెసేజ్‌లనే ప్రామాణికంగా తీసుకోవాలి’ అని కోరారు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం విధుల్లో చేరిన వారిలో పలువురు మళ్లీ స­మ్మె­లో చేరారని కార్యదర్శులు చెబుతున్నారు. 

నోటీసులిస్తే కోర్టులను ఆశ్రయించాలని...  
మంగళవారం సాయంత్రం 5లోగా విధుల్లో చేరకపోతే టెర్మినేట్‌ చేస్తామని పీఆర్‌శాఖ  అల్టిమేటమ్‌ జారీచేసినా...ఈ శాఖ ఉన్నతాధికారులు కొంత సంయమనం పాటిస్తూ బుధ­వారం విధులకు హాజరుకాని వారికి నోటీసులు కూడా జారీచేయలేదని తెలు­స్తోంది. తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నోటీసులిచ్చి న పక్షంలో వాటిని సవాల్‌ చేస్తూ కోర్టులను ఆశ్రయించాలనే అభిప్రాయంతో జేపీఎస్‌లున్నారు. దీనికి సంబంధించి న్యాయపరమైన సలహాలు సైతం తీసుకున్నట్టు  సమాచారం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)