Breaking News

ఎన్పీడీసీఎల్‌లో  నోటిఫికేషన్‌ జారీచేయలేదు

Published on Wed, 01/04/2023 - 01:33

హనుమకొండ: టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌లో ఎలాంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయలేదని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.గోపాల్‌రావు స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో 157 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు వస్తున్న ప్రకటన, ప్రచురణతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లు, కొన్ని పత్రికల్లో 157 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ప్రకటనలు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

ఇలాంటి కథనాలను నమ్మవద్దని, నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌కు చెందిన వెబ్‌సైట్‌లో చూసుకుని వాస్తవాలు నిర్ధారించుకోవాలని గోపాల్‌రావు సూచించారు. సంస్థ ఉద్యోగాల భర్తీ చేపడితే అధికారికంగా పత్రికలు, చానళ్లలో నోటిఫికేషన్‌ ఇస్తుందన్నారు. ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సమాచారాన్ని నమ్మవద్దని కోరారు. చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సంస్థలు 157 యూనిట్లను ఆడిట్‌ చేయాలని ఎన్పీడీసీఎల్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిస్తే.. దీన్ని కొన్ని వెబ్‌సైట్లు, పత్రికలు 157 పోస్టులుగా వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయని, నిరుద్యోగులు దీన్ని గమనించాలని సూచించారు. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)