Breaking News

నేడు శాసనసభ ప్రత్యేక భేటీ

Published on Mon, 12/30/2024 - 05:46

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. భారత మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ మృతికి నివాళులర్పించే ఎజెండాతో సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సంతాప ప్రతిపాదనను ప్రవేశపెట్టి, మన్మోహన్‌ సింగ్‌ దేశానికి చేసిన సేవలను ఉటంకించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్రను విశదీకరిస్తూ ప్రసంగించనున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఈ సమావేశంలో మన్మోహన్‌ సింగ్‌ సేవల గురించి ప్రసంగించనున్నారు.

సంతాప తీర్మానాన్ని ఆమోదించాక సభ వాయిదా పడనుంది. కాగా, సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఆదివారం పరిశీలించారు. సభ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సిబ్బందిని స్పీకర్‌ ఆదేశించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్‌లతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన స్పీకర్‌.. సమావేశాల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని అందించాలని కోరారు. 

అది మన బాధ్యత.. ఎంపీ మల్లురవి: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను స్మరించుకోవడం మన బాధ్యత అని నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లురవి అభిప్రాయపడ్డారు. ఆయనను గుర్తు చేసుకునేందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినందుకు మల్లు రవి.. సీఎం రేవంత్‌రెడ్డికి ఆదివారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. గొప్ప మేధావికి తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న నివాళిగా ఈ సమావేశం నిలిచిపోతుందని మల్లు రవి పేర్కొన్నారు. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)