Breaking News

లగచర్ల దాడి కేసు: రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

Published on Wed, 11/13/2024 - 12:13

సాక్షి, హైదరాబాద్‌: వికారాబాద్‌లోని లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసుకు సంబంధించి రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ దాడి కేసులో ఏ1గా బోగమోని సురేష్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్‌ చేయగా.. మరో 30 మంది పరారీలో ఉన్నట్టు రిపోర్టులో పోలీసులు తెలిపారు.

కలెక్టర్‌పై దాడి కేసుకు సంబంధించి రిమాండ్‌ రిపోర్టు ఇలా.. ఈ దాడి​కి సంబంధించి బూంరాస్‌పేట్‌ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు. 153/2024 క్రైం నెంబర్ కేసు.. సెక్షన్ 61(2), 191(4),132,109,121(1) 126(2)324 r/w190BNS Sec 30Of pdpp act, 128Of bnss కింద కేసులు నమోదయ్యాయి. అలాగే.. హత్యాయత్నం, అసాల్టింగ్, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి నాన్ బెయిలబుల్ కూడా కేసులు నమోదు. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్‌ చేశారు. ఈ దాడి కేసులో మొత్తం 46మందిని నిందితులుగా చేర్చారు.

ఇదీ చదవండి: నరేందర్‌ రెడ్డిని తొక్కేయాలని రేవంత్‌ కుట్ర

ఎఫ్‌ఐఆర్‌లో బోగమోని సురేష్‌ను ప్రధాన నిందితుడుగా(ఏ1) పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16మందిని అరెస్ట్ చేయగా.. మరో 30 మంది పరారీలో ఉన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడిచేశారు. రాళ్లు, కర్రలు, కారంపొడి ముందే సిద్ధం చేసుకున్నారు. అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశాడు A1 నిందితుడు సురేష్. అరెస్ట్ అయిన నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. ఈ ​కేసులో ప్రధాన నిందితుడు సురేష్ పాటు 29 మంది పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు గాయాలయ్యాయి. ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేశారు. దాడి కేసులో నిందితుడు సురేష్ కీలకంగా మారాడు. సురేష్‌ ప్లాన్‌ ప్రకారమే కలెక్టర్‌ను లగచర్లకు తీసుకెళ్లాడు’ అని పోలీసులు పేర్కొన్నారు. 

 

ఇదీ చదవండి: లగచర్ల ఘటన: మార్నింగ్‌ వాక్‌లో పట్నం అరెస్ట్‌

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)