భూముల ధరలు ఎంత పెంచొచ్చు?

Published on Thu, 06/26/2025 - 08:51

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ ధరలను పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం.. అందుకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌), రీజినల్‌ రింగ్‌రోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌) మధ్య ప్రాంతంపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఏ ప్రాంతంలో ఎంత మొత్తం ధరలు పెంచేందుకు వీలుంటుందనే అంశంపై ప్రతిపాదనలు పంపాలని అన్ని జిల్లాల రిజిస్ట్రార్లను ఇప్పటికే ఆదేశించగా, అధికారులు ప్రతిపాదనలు కూడా పంపారు. ఓఆర్‌ఆర్, ట్రిపుల్‌ ఆర్‌ మధ్యలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్‌ విలువకు, మార్కెట్‌ విలువకు ప్రస్తుతం భారీ వ్యత్యాసం ఉంది. దీన్ని తగ్గించడంతో పాటు, రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్రాంతంలో భూముల ధరలను భారీగా పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ప్రతిపాదనల్లో కొన్ని..
ట్రిపుల్‌ ఆర్‌ ప్రాంతంలోని సదాశివపేట మండలం పెద్దాపూర్‌లో రిజి­స్ట్రేషన్‌ రేటు చదరపు గజానికి రూ.1,700 (కమర్షియల్‌), రూ.1,100 (రెసిడెన్షియల్‌) ఉంది. దీనిని కమర్షియల్‌ ఏరియాలో చ.గజానికి రూ.3,500ల వరకు, రెసిడెన్షియల్‌ ఏరియాలో రూ.2,400 వరకు పెంచా­లని ప్రతిపాదనలు పంపారు. అంటే ఈ ప్రాంతంలో సుమారు 200 శాతం వరకు భూముల ధరలు పెంచాలని భావిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా కొల్లూరు, ఈదులనాగులపల్లి, వెలిమెల, పాఠిఘనా­పురం, కర్దనూరు, ముత్తంగి, పోచారం, పటేల్‌గూడ, కిష్టారెడ్డిపేట, సుల్తాన్‌­పూర్, దయార, బొల్లారం వంటి గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ ధరను 300 శాతం వరకు పెంచాలని ప్రతిపాదించారు.

 రామచంద్రాపురంలో రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ రేటు చదరపు గజానికి రూ.22,500 ఉంది. దీన్ని రూ.50 వేల వరకు ప్రతిపాదిస్తున్నారు. 

తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో అపార్ట్‌మెంట్లలో ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.2,250 వరకు రిజిస్ట్రేషన్‌ రేటు ఉంది. దీనిని రూ.3,500ల వరకు పెంచాలని భావిస్తున్నారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)