Breaking News

‘సుప్రభాత’ పరిమళం వ్యాపించాలి

Published on Wed, 12/31/2025 - 03:09

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రముఖ అగరబత్తుల తయారీ సంస్థ అంబికా అగరబత్తీస్‌ అరోమా అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌.. రాగస్వర సుప్రభాతం పేరుతో నూతన అగరబత్తుల బ్రాండ్‌ ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. మంగళవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్‌లో కొలువైన సమతామూర్తి సన్నిధిలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి ఆ బ్రాండ్‌ అగరబత్తులను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అనే మాట విస్తృతంగా ప్రచారం జరిగింది. అందుకు తగినట్లే దైవంపట్ల విశ్వాసాన్ని మరింత పెంచుతూ గొప్పగా ఎదిగింది. దేవునికి సమర్పించే ధూపం ఘాటుగా ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉండకూడదు. ముక్కుకు పరిమళం, కంటికి ఇంపుగా ఉండాలి. 

అలాంటి పరిమళ ధూపాన్ని 125 ఏళ్లుగా అందిస్తూ ఎప్పటికప్పుడు అంబికా సంస్థ సరికొత్త ఉత్పత్తులను అందిస్తోంది. పూజ గదిలో అగరబత్తుల పెట్టె తెరవగానే వేంకటేశ్వర స్వామివారి సుప్రభాత స్వరం వినిపించడంతో కొత్త అనుభూతిని పొందుతారు. రాగస్వర సుప్రభాతం అగరబత్తులు భక్తుల ఆధరణ పొందాలి. ప్రతి దైవ సన్నిధానంలోనూ అంబికా సంస్థ సేవలు అందాలి’ అని ఆకాంక్షించారు.

చెవులారా కూడా ఆస్వాదించొచ్చు: అంబికా కృష్ణ
అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ మాట్లాడుతూ.. ‘ఏదైనా అగరబత్తిని వెలిగించినప్పుడు దాని పరిమళాన్ని ముక్క ద్వారానే ఆస్వాదిస్తాం. కానీ ముక్కు ద్వారానే కాకుండా చెవుల ద్వారా కూడా ఆస్వాదించే ఒక అద్భుతాన్ని మా రాగస్వర సుప్రభాతం అగర్‌బత్తి ప్యాకెట్లో నిక్షిప్తం చేశాం. ప్యాకెట్‌ తెరవగానే వేంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తుంది. చెవులకు భక్తిని అనుసంధానిస్తుంది’ అని చెప్పారు. 

భగవంతుడిని మేల్కొలిపే సుప్రభాత మధుర పిలుపు.. మనలో దైవత్వాన్ని కూడా మేల్కొలుపుతుందని అంబికా సంస్థల డైరెక్టర్‌ రామచంద్రరావు చెప్పారు. అన్ని పూజా స్టోర్లు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రాగస్వర సుప్రభాతం అగరబత్తులు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఒక్కో ప్యాకెట్‌ ధరను రూ. 200గా ఖరారు చేసినట్లు చెప్పారు.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)