Breaking News

నేతలు పట్టించుకోక మరో 'దారి' లేక

Published on Mon, 08/11/2025 - 01:11

నారాయణఖేడ్‌: ఓవైపు వర్షం.. మరోవైపు నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. సకాలంలో 108 అంబులెన్స్‌ వచ్చినా గర్భిణి చెంతకు చేరే రోడ్డుమార్గం లేక 2 కి.మీ. దూరంలోనే నిలిచిపోయిన పరిస్థితి. దీంతో భర్త తన భార్యను మోసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ఆమెకు పురిటినొప్పులు ఎక్కువై చెట్టు కింద ప్రసవించింది. సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం మున్యానాయక్‌ తండాలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. 

శాంతినగర్‌ తండా పంచాయతీ పరిధిలోని మున్యానాయక్‌ తండాకు చెందిన కౌసల్యాబాయి (26)కి నెలలు నిండటంతో పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు 108కి ఫోన్‌లో సమాచారం ఇవ్వగా అంబులెన్స్‌ 2 కి.మీ. దూరంలోని గురుసింగ్‌ తండా వరకు వచ్చి ఆగిపోయింది. 

ముందుకు వెళ్లేందుకు రోడ్డు లేకపోవడంతో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ (ఈఎంటీ) సంగ్‌శెట్టి, అంబులెన్స్‌ డ్రైవర్‌ కాలినడకన గర్భిణి కోసం ఎదురు వెళ్లారు. అప్పటికే తండా నుంచి భర్త వాసుదేవ్, ఇతర కుటుంబ సభ్యులు కౌసల్యాబాయిని మోసుకొస్తుండగా నొప్పులు అధికమై మార్గమధ్యలో చెట్టుకింద ప్రసవించి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కౌసల్యాబాయికి ఇది మూడవ కాన్పు. 

ఇప్పటికే కూతురు, కుమారుడు ఉన్నారు. బాలింతను అంబులెన్స్‌ ఆగిన గురుసింగ్‌ తండా వరకు ఈఎంటీ సంగ్‌శెట్టి మోసుకొచ్చాడు. అనంతరం అంబులెన్స్‌లో కరస్‌గుత్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. 

గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తమ తండాకు రోడ్డు సౌకర్యం లేకపోవడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విన్నవించినా పట్టించుకోలేదన్నారు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం వస్తున్నారు తప్ప తమ బాగోగులు చూడటం లేదని గిరిజన మహిళలు మండిపడ్డారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)