Breaking News

ఏఐ ఏజ్‌లో ఎడ్ల బండిపై గర్భిణి!!

Published on Mon, 11/17/2025 - 09:56

దహెగాం(సిర్పూర్‌): ఏఐ యుగంలోనూ జిల్లాలోని మారుమూల గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేక వైద్యానికి గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు. వంతెన లేకపోవడంతో ఓ గర్భిణి ప్రయాణానికి ఎడ్లబండే దిక్కయింది. ఈ ఘటన దహెగాం మండలంలో చోటు చేసుకుంది. మురళీగూడకు చెందిన కుమురం వనితకు ఆదివారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. మురళీగూడ గ్రామానికి వెళ్లే దారిలో ఒర్రెపై వంతెన లేకపోవడంతో వాహనం అక్కడే ఆగిపోయింది. భర్త నాగేశ్‌ వనితను ఎడ్లబండిపై ఎక్కించుకుని ఒర్రె దాటించాడు.

అక్కడి నుంచి అంబులెన్సు ద్వారా దహెగాం పీహెచ్‌సీలో చేర్పించగా పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని.. కాస్త ఆలస్యమై ఉంటే రెండు నిండు ప్రాణాలు పోయేవని వైద్యసిబ్బంది చెబుతున్నారు. పెసరికుంట స్టేజీ నుంచి మురళీగూడ వరకు కిలోమీటరున్నర మట్టిరోడ్డు కావడంతో వర్షాకాలంలో వాహనాల రాకపోకలు సాధ్యం కాదు. వర్షాలు లేనందున వాహనాలు ఒర్రె వరకు వెళ్తున్నాయని స్థానికులు తెలిపారు. వంతెన నిర్మించి ప్రయాణ కష్టాలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)