Breaking News

ఆదివాసీ బాలికపై అఘాయిత్యం?

Published on Mon, 08/25/2025 - 01:14

పాల్వంచ రూరల్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పెద్దమ్మతల్లి ఆలయ సమీపంలో శనివారం రాత్రి ఓ ఆదివాసీ బాలిక ఒంటిపై గాయాలు, చిరిగిన దుస్తులతో కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన గురించి ఐసీడీఎస్‌ సీడీపీవో ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలానికి చెందిన ఓ బాలిక ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుంటలో ఉన్న బంధువుల ఇంటికి వారం క్రితం వెళ్లింది. తిరిగి శనివారం తన సోదరులు ఉంటున్న చింతూరు మండలం గొల్లగుప్పకు వెళ్లేందుకు కుంట బస్టాండ్‌కు చేరుకుంది. 

ఆ సమయంలో బస్సులు లేకపోవడంతో అటుగా వెళ్తున్న ఓ ట్రాలీ ఆటో ఎక్కింది. అందులోని ఇద్దరు యువకులు మధ్యలో ట్రాలీ నిలిపి మద్యం సేవించారని.. తనకు కూడా మత్తుమందు కలిపిన డ్రింక్‌ను బలవంతంగా తాగించడంతో స్పృహ కోల్పోయానని బాలిక తెలిపింది. తనకు మెలకువ వచ్చేసరికి పాల్వంచ మండలం పెద్దమ్మతల్లి ఆలయం వద్ద ఉన్నానని చెప్పింది. ఆలయ వాచ్‌మన్‌ లింగపంపల్లి శ్రీను అందించిన సమాచారంతో బాలికను వెంటనే కొత్తగూడెంలోని బాలిక సంరక్షణ అధికారుల పర్యవేక్షణలో ఉంచారు. 

ఆమె సోదరులకు సమాచారం అందించామని సీడీపీవో లక్ష్మీప్రసన్న తెలిపారు. బాలికకు కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించి పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. బాలిక శరీరంపై గాయాలు ఉండగా.. దుస్తులు కూడా చిరిగిపోయాయని చెప్పారు. బాలికపై అత్యాచారం జరిగిందా లేదా అనేది వైద్య నివేదిక వస్తే తెలిసే అవకాశం ఉందని.. సీడీపీవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పాల్వంచ సీఐ సతీశ్‌ పేర్కొన్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)