Breaking News

చెల్లిని ఇవ్వొద్దు..

Published on Tue, 10/28/2025 - 07:50

తిరుమలగిరి(నాగార్జునసాగర్‌): ఆడ శిశువు పుట్టిన పదిరోజులకే గిరిజన దంపతులు విక్రయించారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలం యల్లాపురంతండాకు చెందిన కొర్ర బాబు–పార్వతి దంపతులు నల్లగొండలో కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పార్వతి మొదటి కాన్పు 2016లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఉమ్మనీరు అధికంగా తాగడంతో పుట్టినబాబు అదే రోజున మృతిచెందాడు. ఆ తర్వాత పార్వతి రెండు, మూడు కాన్పుల్లోనూ ఆడపిల్లలకు జన్మనిచ్చింది. వారసుడి కోసం పార్వతి నాలుగోసారి గర్భం దాల్చింది.

పది రోజుల క్రితం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించగా.. మళ్లీ ఆడపిల్లే జన్మించింది. అయితే ముగ్గురు ఆడపిల్లలను సాకలేమని భావించిన ఆ దంపతులు ఆ శిశువు అమ్మకానికి సిద్ధమయ్యారు. మధ్యవర్తుల ద్వారా గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన దంపతులకు ఆడశిశువును రూ.3 లక్షలకు రెండు రోజుల క్రితం విక్రయించారు. బాబు–పార్వతి దంపతులు శిశువును విక్రయిస్తుండగా.. వారి కుమార్తెలు చెల్లిని ఇవ్వొద్దంటూ గుక్కపట్టి ఏడుస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

అమ్మా, నాన్న చెల్లిని ఇవ్వకండి అంటూ ఏడుస్తున్న వీడియో చూసిన ప్రతి ఒక్కరి మనసు కలిచివేసింది. ఆ తర్వాత పార్వతి తన పుట్టినిల్లు పెద్దవూర మండలం ఊరబావితండాకు వెళ్లింది. శిశువుని విక్రయించిన విషయం కొర్ర బాబు అన్న సురేశ్‌నాయక్‌కు తెలియడంతో ఆ చిన్నారిని మనమే సాకుదామని విక్రయించిన శిశువును తిరిగి తీసుకురావాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే విషయం అంగన్‌వాడీ అధికారుల దృష్టికి వెళ్లింది. అధికారులు వారి ఇంటికి వచ్చి వివరాలు సేకరించారు.   

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)