Breaking News

దివ్యాంగుడైన కొడుకును చంపి తండ్రి ఆత్మహత్య

Published on Mon, 01/19/2026 - 06:10

జన్నారం: పుట్టుకతో దివ్యాంగుడైన 9 ఏళ్ల కొడుకు భారం మోయలేక.. రెండేళ్లుగా తన అనారోగ్యం కారణంగా పెరిగిన అప్పులు తీర్చే దారిలేక ఓ తండ్రి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కుమారుడి గొంతుకోసి చంపి తానూ గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్‌లో ఆదివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్‌కు చెందిన భూమయ్య (38)–స్వరూప దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. భూమయ్య దంపతులు కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తున్నారు. అయితే కొడుకు కార్తీక్‌ (9) పుట్టుకతో దివ్యాంగుడు. అతనికి చెవులు వినబడవు, మాటలు రావు. అలాగే నడవలేక మంచానికే పరిమితమయ్యాడు.

కొడుకు ఆరోగ్యం కోసం అప్పులు చేసి అనేక ఆస్పత్రుల్లో చూపించినా పరిస్థితి మెరుగుపడలేదు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన భూమయ్య రెండేళ్ల క్రితం లివర్‌ పాడైపోవడంతో ఆపరేషన్‌ కోసం రూ. 5 లక్షలు అప్పు చేశాడు. అలాగే కుమారుడి చికిత్స కోసం మరో రూ. లక్ష అప్పు తీసుకొచ్చాడు. అయినా కుమారుడి పరిస్థితి మెరుగవకపోవడంతో తిరిగి మద్యానికి బానిసై ఏడాదిగా ఇంటికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం చిన్న కూతురును పిలిచి తనకు జ్వరం వచ్చిందని.. డాక్టర్‌ను తీసుకురావాలని సూచించాడు.

కూతురు బయటకు వెళ్లగానే తలుపులు వేసి గడియ పెట్టుకొని కొడుకు గొంతు కోశాడు. తర్వాత తాను గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్‌ఎంపీ వచ్చి చూడగా తలుపు లోపల గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా తీయకపోవడంతో బద్దలు కొట్టారు. అప్పటికే కార్తీక్, భూమయ్య మృతిచెందారు. కాగా, భూమయ్య చనిపోవడానికి ముందు పెద్దకూతురు వర్షితతో రాయించిన లేఖ బయటపడింది. తనతోపాటు కుమారుడి వైద్య ఖర్చుల కోసం తెచ్చిన అప్పులు తీర్చేందుకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నా డబ్బు రావట్లేదని.. కుమారుడికి పింఛన్‌ కోసం కలెక్టర్‌కు విన్నవించినా ఇవ్వట్లేదని లేఖలో భూమయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)