Breaking News

ప్రైవేటు ఆస్పత్రిలో యువతిపై లైంగికదాడి

Published on Mon, 09/08/2025 - 10:17

కరీంనగర్‌ క్రైం: కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా ఉన్న యువతిపై లైంగికదాడి జరిగింది. ఆస్పత్రి కాంపౌండర్‌ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కరీంనగర్‌ త్రీటౌన్‌ పోలీసుల వివరాల ప్రకారం.. పొరుగు జిల్లాకు చెందిన ఓ యువతి ఆరోగ్యం బాగోలేదని కరీంనగర్‌లోని శ్రీదీపిక ఆస్పత్రిలో శనివారం ఇన్‌పేషెంట్‌గా అడ్మిట్‌ అయ్యింది. ఎమర్జెన్సీ వార్డులో నిద్రిస్తున్న యువతిపై ఆదివారం వేకువజామున ఆస్పత్రిలో పనిచేసే కాంపౌండర్‌ దక్షిణామూర్తి (24) మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు. 

విషయాన్ని యువతి తన కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. బాధితురా లిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో సీసీ పుటేజీలు, బెడ్‌షీట్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో ఎమర్జెన్సీ వార్డులో ఇతర పేషెంట్లు ఎవరైనా ఉన్నారా, డ్యూటీ డాక్టర్లు, సిబ్బంది ఎవరున్నారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)