Breaking News

HYD: బేగంపేట రూట్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Published on Tue, 12/19/2023 - 07:04

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో శీతాకాలం విడిది కోసం దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో రాష్ట్రపతి ముర్ము ఇవాళ  హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో.. 

ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు పోలీసులు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల దాకా బొల్లారం నుంచి బేగంపేట రూట్‌లో ట్రాఫిక్‌ను పోలీసులు నియంత్రిస్తారు. కాబట్టి.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు.

ప్రతీయేడులాగే.. ఈసారి కూడా శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. సోమవారం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమెకు గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ విడిదిలో ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలువురు ప్రముఖులను, సామాన్యులను కలిసే వీలుంది.

అయితే అధికారిక షెడ్యూల్‌ ప్రకారం.. ఈనెల 20వ తేదీన భూదాన్‌ పోచంపల్లిలో ఆమె పర్యటించి చేనేత ప్రదర్శనలో పాల్గొంటారు. ఈనెల 23న రాష్ట్రపతి ముర్ము తిరిగి ఢిల్లీ బయల్దేరే అవకాశాలు ఉన్నాయి. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)