Breaking News

ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఇక సెల్‌ఫోన్ వాడొద్దు!

Published on Mon, 07/27/2026 - 07:33

కరీంనగర్‌క్రైం: ట్రాఫిక్‌ నియంత్రణలో ఆటంకాలు లేకుండా, ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో రాష్ట్ర పోలీసుశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్‌ పోలీసులు విధుల్లో వ్యక్తిగత సెల్‌ఫోన్లు ఉపయోగించొద్దని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో కరీంనగర్‌ కమిషనరేట్‌వ్యాప్తంగా ట్రాఫిక్‌ సిబ్బంది సెల్‌ఫోన్లు లేకుండానే విధులకు హాజరవుతున్నారు. జంక్షన్ల వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో కొందరు ఫోన్లలో మాట్లాడటం, సోషల్‌ మీడియా వినియోగించడం, వ్యక్తిగత కాల్స్‌కు స్పందించడం ద్వారా ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రభావం పడుతున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో విధుల సమయంలో సెల్‌ఫోన్‌ వినియోగాన్ని నిషేధిస్తూ పోలీస్‌బాస్‌ ఆదేశాలిచ్చారు.

అయితే ఇంట్లో.. లేకపోతే స్టేషన్‌లో డిపాజిట్‌
కమిషనరేట్‌ పరిధిలో చాలామంది ట్రాఫిక్‌ పోలీసులు వ్యక్తిగత సెల్‌ఫోన్లను ఇంట్లోనే ఉంచి విధులకు హాజరవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంట తీసుకొచ్చినా పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్‌ చేసి, డ్యూటీ పూర్తయిన తర్వాత తీసుకుంటున్నారు. దీంతో విధి నిర్వహణ సమయంలో వ్యక్తిగత ఫోన్‌ వినియోగానికి పూర్తిగా అడ్డుకట్ట పడుతోంది. ట్రాఫిక్‌ సిగ్నల్స్, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఒక్క క్షణం నిర్లక్ష్యం జరిగినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని గుర్తించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అధికారులకు మినహాయింపు
ట్రాఫిక్‌ విభాగంలో విధులు నిర్వహించే ఉన్నతాధికారులకు అధికారిక కమ్యూనికేషన్, అత్యవసర సమాచార మార్పిడి కోసం సెల్‌ఫోన్లు వినియోగించే వెసులుబాటు కల్పించారు. కరీంనగర్‌ ట్రాఫిక్‌ విభాగంలో ప్రస్తుతం ఒక ఏసీపీ, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, సుమారు 65మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కొత్త ఆదేశాల మేరకు ఫీల్డ్‌ సిబ్బంది సెల్‌ఫోన్లు ఉపయోగించకుండా విధులు నిర్వహిస్తున్నారు.

వేగవంతమైన సేవలు
ట్రాఫిక్‌ నియంత్రణలో ఎలాంటి అంతరాయాలు లేకుండా, ప్రమాదాలను తగ్గించి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఉత్తర్వులు అమలు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు విధించడానికి ఫొటోలు తీసి, తిరిగి వాటిని డిలీట్‌ చేస్తున్నారన్న ఆరోపణలు రావడం కూడా ఈ నిర్ణయానికి కారణంగా చర్చ జరుగుతోంది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారుల ఫొటోలు తీసి చలాన్లు వేయడానికి పోలీసులకు త్వరలోనే ప్రత్యేక కెమెరాలు అందించనున్నట్లు తెలిసింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)