Breaking News

సచివాలయానికి సిటీ బస్సులు.. ప్రయాణికులకు తిప్పలు

Published on Tue, 12/10/2024 - 07:31

సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సులు సచివాలయానికి పరుగులు తీశాయి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి  ప్రభుత్వం వివిధ ప్రాంతాల నుంచి మహిళలను పెద్ద ఎత్తున తరలించింది. ఇందుకోసం సిటీబస్సులను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, భువనగరి, చౌటుప్పల్, సంగారెడ్డి తదితర శివారు జిల్లాలతో పాటు నగరంలోని వివిధ నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలను పెద్ద సంఖ్యలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. 

దీంతో ప్రైవేట్‌ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. బస్సులన్నీ సచివాలయం కోసమే ఏర్పాటు చేయడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా సాయంత్రం విధులు ముగించుకొని ఇళ్లకు చేరుకొనే ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగానికి చెందిన ఉద్యోగులు, వ్యాపారులు, స్కూళ్లు, కాలేజీల నుంచి ఇళ్లకు బయలుదేరిన విద్యార్థులు గంటలతరబడి బస్సుల కోసం పడిగాపులు కాశారు. 

చివరకు ఆటోలు, తదితర ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లవలసి వచ్చింది. మరోవైపు  సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం  నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ స్తంభించింది. అమీర్‌పేట్, ఖైరతాబాద్, నెక్లెస్‌ రోడ్డు, లిబర్టీ, ఇందిరాపార్కు లోయర్‌ట్యాంక్‌బండ్‌ తదితర చోట్ల వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లోనే ఉండాల్సి వచ్చింది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)