Breaking News

రేపు ‘భారత్‌ దాల్‌’ ప్రారంభం

Published on Sat, 09/30/2023 - 03:14

సాక్షి, హైదరాబాద్‌: పప్పుధాన్యాలకు ప్రత్యామ్నాయంగా శనగపప్పు (చనా) విని­యోగాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహా­ర, ప్రజాపంపిణీ సంస్థ ‘భారత్‌ దాల్‌‘ బ్రాండ్‌ పేరుతో ప్యాక్‌ అందుబా­టులోకి తెస్తోంది. కేంద్రం వద్ద ఉన్న శనగపప్పు స్టాక్‌లో 20 శాతం రిటైల్‌ సరఫరాగా మార్చి సబ్సిడీ ధరలకు అందించనుంది. ఈ మేరకు వన్‌ నేషన్‌ వన్‌ ప్రైస్‌ ధరలను అమలు చేస్తోంది. కిలో కేజీ శనగపప్పు ప్యాకెట్‌ రూ.60, 30 కిలోల ప్యాకెట్‌కు కిలోకు రూ.55 చొప్పు­న రూ.1,650కి అందించనున్నారు.

హాకాకు 50 వేల టన్నులు..
ఇక దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలలో ‘భారత్‌ దాల్‌‘ బ్రాండ్‌ శనగపప్పు పంపిణీ బాధ్యతలను రాష్ట్రానికి చెందిన హైదరాబాద్‌ అగ్రికల్చరల్‌ కో–ఆపరేటివ్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ (హాకా)కు అప్పగించింది. రిటైలర్లు, హోల్‌సేల్‌ వ్యాపారులకు, ప్రాథమిక సహకార సంఘాలు (ప్యాక్స్‌), మెట్రో, రిలయ­న్స్, టాటా రిటైల్‌ చైన్‌ హైపర్‌ మార్కెట్‌­లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ వంటి  ఇ–కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లకు హాకా నేరుగా సరఫరా చేయనుంది.

రేపు అధికారికంగా ప్రారంభం
హాకా పంపిణీ చేసే శనగపప్పు భారత్‌ దాల్‌ బ్రాండ్‌ను ఆదివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. నెక్లెస్‌రోడ్‌లో ని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద హాకాచైర్మన్‌ మచ్చా శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రోహిత్‌కుమార్‌ సింగ్‌ పాల్గొననున్నారు.

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)